Cooli : సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో శ్రీ విష్ణు హీరోయిన్

Cooli : సౌత్ ఫిలిం ఇండస్ట్రీ లోనే సెన్సేషనల్ డైరెక్టర్ గా మారాడు లోకేష్ కనకరాజ్. నగరం సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన లోకేష్ వరుసగా సినిమాలు చేస్తూ తన టాలెంట్ను కేవలం తమిళ్ ఫిలిం ఇండస్ట్రీకి మాత్రమే కాకుండా సౌత్ ఇన్ ఇండస్ట్రీకి తెలిసేలా బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు. అయితే విక్రమ్ సినిమాతో ప్రేక్షకులు అందర్నీ తన వైపుకు తిప్పుకున్నాడు దర్శకుడు లోకేష్. లోకేష్ నుంచి ఒక సినిమా వస్తుంది అని అంటే చాలామంది క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాతోనే సినీమెటిక్ యూనివర్స్ తెలుగులో పరిచయం చేశాడు.

ఇకపోతే ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా కూలీ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఈ వీడియో సినిమా పైన విపరీతమైన అంచనాలను పెంచేసింది. ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. లేటెస్ట్ గా రజినీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని దాదాపు 500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టారు. బీస్ట్ సినిమాతో డిజాస్టర్ చవిచూసిన నెల్సన్ కు ఈ సినిమా మంచి బూస్ట్ అయింది. అందుకే జైలర్ 2 సినిమాని కూడా ప్లాన్ చేసే పనిలో పడ్డాడు నెల్సన్.

Reba Monica John

- Advertisement -

ఇక లోకేష్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన కూలీ సినిమా రైట్స్ ఇప్పటికే అమ్ముడుపోయినట్లు సమాచారం వినిపిస్తుంది. ఈ కాంబినేషన్ వినగానే దీనికి భారీ రేటు పలికింది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ రేటుకు కొనుగోలు చేసినట్లు సమాచారం వినిపిస్తోంది. అలానే టెలివిజన్ ప్రీమియర్ కోసం సన్ నెట్వర్క్ సంస్థ భారీగా చెల్లించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ విషయానికొస్తే రీసెంట్ గా హైదరాబాద్ లో మొదలైంది. ఇకపోతే ఈ సినిమాలో రెబ్బా మౌనిక జాన్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. అట్లీ దర్శకత్వంలో విజయ్ నటించిన విజిల్ సినిమాలో కనిపించిన మౌనిక జాన్. శ్రీ విష్ణు నటించిన సామజవరగమన సినిమాలో హీరోయిన్ గా కనిపించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు