Coolie: మరోసారి లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఫహద్ ఫాజిల్

Cooli: రోజులు మారుతున్న కొద్దీ సినిమా రంగంలో అనేక మార్పులు వచ్చాయని చెప్పవచ్చు. అయితే ఒక గొప్ప సినిమా ఏ భాషలో ఉన్నా కూడా తెలుగు ప్రేక్ష కులందరికీ చూడటం అలవాటు. అలానే ఒక గొప్ప దర్శకుడు కూడా ఏ భాషలో ఉన్న అతనిని ఫాలో అవ్వడం, అతని వర్క్ ని ఫాలో అవ్వడం కూడా మొదలుపెట్టారు. అయితే ఇక రీసెంట్ టైమ్స్ లో లోకేష్ కనకరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పేరుకి తమిళ్ దర్శకుడు అయినా కూడా లోకేష్ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారు. తమిళ్ లో కంటే కూడా తన లాస్ట్ సినిమా లియో తెలుగులోనే ముందుగా రిలీజ్ అయింది. అప్పుడు ఆడియన్స్ ఆ సినిమాను చూసి బ్రహ్మరథం పట్టారు.

మా నగరం సినిమాతో ఎంట్రీ

ఇకపోతే “మా నగరం” అనే సినిమాతో 2017లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు లోకేష్ కనకరాజ్. మొదటి సినిమాతోనే టెక్నికల్ గా బ్రిలియంట్ గా ఆ సినిమాను అద్భుతంగా తెరకెక్కించి తనకంటూ ఒక మార్కును క్రియేట్ చేసుకున్నాడు లోకేష్ కనకరాజ్. అయితే ఆ సినిమా తర్వాత లోకేష్ 2019లో ఖైదీ అనే సినిమాను తెరకెక్కించాడు. ఖైదీ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక నైట్ జర్నీని అద్భుతంగా చూపించి ఆడియన్స్ అందర్నీ థియేటర్లో కూర్చొని పెట్టి ఒక మంచి ఆసక్తిని రేకెత్తించేలా ఆ సినిమాని తెరకెక్కించాడు.

ఖైదీ సినిమాతో ఫ్యాన్ బేస్

ఖైదీ సినిమా తర్వాత చేసిన సినిమా మాస్టర్. మాస్టర్ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. అయితే విజయ్ సేతుపతి, విజయ్ ఇద్దరిని పెట్టి ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు లోకేష్. ఈ సినిమాలో విజయ్ ని చూపించిన విధానం. ఈ సినిమా కాన్సెప్ట్, ఈ సినిమా టేకింగ్ అన్నీ కూడా ఆడియన్స్ కి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ని ఇచ్చాయి. ఆ తర్వాత చేసిన సినిమా విక్రమ్.

- Advertisement -

Coolie

విక్రమ్ సినిమాతో కమలహాసన్ కం బ్యాక్

విక్రమ్ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఆల్మోస్ట్ కమల్ హాసన్ కి హిట్ లేదు అనుకునే టైంలో విక్రమ్ సినిమాతో ఒక సంచలనానికి తెర తీశాడు లోకేష్ కనకరాజ్.
కేవలం ఆ సినిమా హిట్ అవ్వడమే కాకుండా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ ఒకటి ఉంది అని ఆడియన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చాడు. అయితే విక్రమ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కమల్ హాసన్ ఇమేజ్ ని పర్ఫెక్ట్ గా వాడి ఆ సినిమాను బ్లాక్ బస్టర్ గా మలిచాడు లోకేష్. ఆ సినిమా తర్వాత లోకేష్ స్థాయి అమాంతం పెరిగిపోయింది. ఇప్పటికీ లోకేష్ నుంచి ఒక సినిమా వస్తుంది అని అంటే ఆడియోన్స్ చాలా క్యూరియాసిటీతో వెయిట్ చేస్తారు.

మరోసారి ఫహాద్ ఫాజిల్

విక్రమ్ సినిమాలో ఫహాద్ ఫాజిల్ ఒక కీలకమైన పాత్రలో కనిపించాడు. ఫస్ట్ ఆఫ్ చూస్తున్న చాలామందికి ఫహద్ హీరోలా కనిపిస్తాడు. ఇక ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ రజనీకాంత్ హీరోగా కూలీ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ జూలై ఒకటో తారీకు నుంచి మొదలుకానుంది. అయితే ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో ఫహద్ కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని గురించి అధికార ప్రకటన రావాల్సిందే.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు