CPI Narayana: 10 యేళ్ళ అద్దె వసూలు చేయాలి.. నాగార్జున పై షాకింగ్ కామెంట్స్..!

CPI Narayana.. తాజాగా నాగార్జున (Nagarjuna)ఎన్ – కన్వెన్షన్ (N- Convention)హాల్ కూల్చివేత పై సర్వత్రా ఉత్కంఠ నెలకొనింది. తుమ్మిడికుంట చెరువు ప్రాంతంలో 10 ఎకరాల విస్తీర్ణంలో ఎన్ కన్వెన్షన్ హాల్ నిర్మించగా.. అందులో మూడున్నర ఎకరాలు చెరువుకు సంబంధించిన భూమి అని , కబ్జా చేసి నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ నిర్మించారు అంటూ ఆరోపణలు వచ్చి, దానిని హైడ్రా కూల్చివేసింది. అయితే ఈ కూల్చివేతపై తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని ఆక్రోషం వ్యక్తం చేస్తూ కోర్టు ను ఆశ్రయించిన నాగార్జున, కోర్టు వెంటనే స్టే విధిస్తూ కూల్చివేత ఆపాలని చెప్పినప్పటికీ అప్పటికే కూల్చివేశారు.

CPI Narayana: Ten years rent should be collected.. Shocking comments on Nagarjuna..!
CPI Narayana: Ten years rent should be collected.. Shocking comments on Nagarjuna..!

10 యేళ్ళ అద్దె నాగార్జున నుంచి వసూలు చేయాలి.

దీనిపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తూ ఉండగా.. తాజాగా సిపిఐ నారాయణ (CPI Narayana) కూడా సంచలన కామెంట్లు చేశారు. హైడ్రా ఏర్పాటు మంచి పరిణామమని సిపిఐ నారాయణ తెలిపారు. గత ప్రభుత్వం చేయనిది ఇప్పుడు రేవంత్ చేస్తున్నారు. పల్లా, మల్లారెడ్డికి చెందిన అక్రమ నిర్మాణాలను కూడా కూల్చి వేయాలి. నాగార్జున (Nagarjuna)బిగ్ బాస్ కే బిగ్ బాస్ లా మారారు. దొంగ పట్టాలు సృష్టించి చెరువు కూడా కబ్జా చేశారు. ఆయన నుంచి పదేళ్ల అద్దె వసూలు చేయాలి అంటూ వ్యాఖ్యానించారు. నాగార్జున కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారు అంటూ సంచలన కామెంట్లు చేశారు. మొత్తానికైతే సిపిఐ నారాయణ ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

కబ్జా చేశారంటూ ఆరోపణలు.

ఇకపోతే నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేయడం పై సర్వత్రా ఉత్కంఠ నెలకొనింది. నాగార్జున లాంటి వేలకోట్ల ఆస్తులు ఉన్న వ్యక్తి , కేవలం మూడున్నర ఎకరాలను కబ్జా చేయడం ఏంటి..? అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరి కొంతమంది నాగార్జున అక్రమ ఆస్తులను ఇలా కూల్చివేయడమే కరెక్ట్ అంటూ రకరకాల కామెంట్లు చేస్తుండగా, వెంటనే ఆయన రియాక్ట్ అయ్యారు.

- Advertisement -

10 ఎకరాలు ప్రైవేట్ భూమి అంటూ నోట్ వదిలిన నాగార్జున..

ఒకవైపు నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చి వేశారంటూ కథనాలు వెలువడిన వెంటనే, ఆయన ఒక నోట్ విడుదల చేశారు. తాము ఎటువంటి భూమి కబ్జా చేయలేదని 10 ఎకరాల భూమి మొత్తం అది ప్రైవేటు భూమి అని.. తమ పరువుకు భంగం కలిగించారు తమపై ప్రజలలో నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి ఇలాంటివి చేస్తున్నారు అధికారులు. తప్పుడు దోవలో నా కన్వెన్షన్ హాల్ కూల్చేశారు. నేను తప్పకుండా కోర్టును ఆశ్రయిస్తాను అంటూ ఆయన ఒక నోట్ విడుదల చేశారు.

స్టే విధించిన హైకోర్టు.

అయితే కోర్టును ఆశ్రయించిన వెంటనే హైకోర్టు కూల్చివేతపై స్టే విధించింది. కానీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే హైడ్రా పెద్దపెద్ద బుల్డోజర్లను ఉపయోగించి ఎన్ – కన్వెన్షన్ హాల్ లోని రెండు పెద్ద హాళ్లను కూల్చేసింది. మొత్తానికైతే ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేత పై ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కోరకంగా కామెంట్లు చేస్తూ ఉండగా సిపిఐ నారాయణ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు. మరి దీనిపై నాగార్జున వివరణ ఇస్తారేమో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు