Eswari Rao: హీరోయిన్స్ కి మించి క్రేజ్.. లైనప్ చూస్తే షాక్..!

ఏ ఇండస్ట్రీలో నైనా గతంలో హీరోయిన్ గా నటించి ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్లు చాలామంది ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చి.. పలు పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అలాంటి వారిలో నటి ఈశ్వరీ రావు కూడా ఒకరు.. అచ్చ తెలుగు అమ్మాయిగా 1990లో తన సినీ కెరియర్ ను మొదలుపెట్టి.. ఇప్పటివరకు నటిగా ఫుల్ బిజీగానే కెరియర్ ను కొనసాగిస్తోంది. తెలుగులో మొదటిసారి ఇంటింట దీపావళి అనే చిత్రం తో అరంగేట్రం చేసిన ఈమె.. ఇందులో కూడా సహాయక నటి పాత్రలో నటించింది.

ఈశ్వరీ రావు హీరోయిన్గా తక్కువ సినిమాలు చేసినప్పటికీ… సహాయక పాత్రలలో ఎక్కువగా నటించింది. ఈమెకు కూడా ఇలాంటి పాత్రలలో నటించడం అంటేనే చాలా ఇష్టమట. తెలుగులో ఈమె క్రేజ్ మరింత డబుల్ అవ్వడానికి ముఖ్య కారణం రాంబంటు సినిమా అని చెప్పవచ్చు.. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ కి భార్యగా నటించింది. ఆ తర్వాత మూడు నాలుగేళ్ల పాటు అలా పలు ప్రధాన పాత్రలో నటించినా పెద్దగా వర్కౌట్ కాలేదట.

దాంతో 2000వ సంవత్సరం నుంచి పూర్తీ స్థాయిలో అత్తగా, అమ్మగా ఇతరత్రా పాత్రలలో నటించడానికి ప్రాధాన్యత ఇచ్చింది ఈశ్వరీ రావు. తమిళ డైరెక్టర్, నటుడు అయిన రాజా ను వివాహం చేసుకోగా.. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. అలా 2006 వరకు ఈమె ఒకటి రెండు చిత్రాలలో మాత్రమే నటించింది. కేవలం తన పిల్లల కోసమే పూర్తిగా గ్యాప్ తీసుకొని మళ్ళీ 8 ఏళ్ల విరామం తర్వాత లెజెండ్ చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రీఎంట్రీ ఇచ్చింది ఈశ్వరీ రావు.

- Advertisement -

ఈశ్వరీ ఎక్కువగా తమిళ సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నప్పటికీ ఆమెకు ఎక్కువగా అవకాశాలు తెలుగులోనే వచ్చేవి.. అలా ఎన్నో గుర్తుండిపోయే పాత్రలలో కూడా నటించింది. గత ఏడాది ఈమె నటించిన సినిమాల విషయానికి వస్తే.. పెద్దకాపు, వీర సింహారెడ్డి, పిండం, దూత, సలార్ తదితర చిత్రాలలో నటించింది. ఈ ఏడాది గుంటూరు కారం చిత్రంలో మహేష్ బాబుకి అత్త పాత్రలో నటించింది. ఎలాంటి పాత్రలోనైనా సరే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా నటిస్తుంది ఈశ్వరీ రావ్. ఏది ఏమైనా ఒకప్పుడు హీరోయిన్ గా ఈమెను ఒప్పుకోని ప్రేక్షకులు ఇప్పుడు ఈమె కోసమే చిత్రాలు చూస్తున్నారటంలో సందేహం లేదు. మొత్తానికైతే నటిగానే కెరియర్ మొదలుపెట్టిన ఈమె హీరోయిన్స్ కి మించి క్రేజ్ సంపాదించుకోవడం విశేషం.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు