Kalki 2898 AD : క్రేజీ అప్డేట్ .. అక్కడ ప్రభాస్ ‘కల్కి’ థీమ్ సాంగ్ ఈవెంట్..

Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మోస్ట్ అవెటెడ్ మూవీ ‘కల్కి AD 2898’ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న డార్లింగ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.. కల్కిని జనాల్లోకి తీసుకెళ్లేందుకు టీమ్ బాగా కష్టపడుతున్నారు. రోజుకో అప్డేట్ ను వదులుతున్నారు. ఇప్ప‌టికే మూవీ నుంచి టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ల‌తో పాటు ఫ‌స్ట్ సింగిల్ విడుద‌ల చేయ‌గా మాస్ రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా మూవీ నుంచి మరో అప్డేట్ ను మేకర్స్ వదిలారు..

కల్కి థీమ్ సాంగ్ ను విడుదల చేయబోతున్నట్లు ఒక పోస్టర్ తో ప్రకటించారు.. క‌ల్కి థీమ్ సాంగ్‌ను నేడు శ్రీకృష్ణుని జన్మస్థలం అయిన ఉత్తర ప్రదేశ్‌లోని మధుర నగ‌రంలో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.. స్టార్ డైరెక్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా , వైజయంతి మూవీస్ బ్యాన‌ర్‌పై అశ్విన్ దత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. దీపికా ప‌దుకొనే, దిశా ప‌టానీ క‌థానాయిక‌లుగా న‌టిస్తుండ‌గా.. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, కీలక పాత్రలు పోషిస్తున్నారు..

Crazy update from Kalki.. Theme event in Mathura
Crazy update from Kalki.. Theme event in Mathura

ఇకపోతే ఈ సినిమా జూన్ 27 న విడుదల కాబోతుంది.. ఈ సినిమాను స్క్రీన్ మీద ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. అటు ఉత్తర అమెరికా వ్యాప్తంగా ఏకంగా 210కి పైగా ఐమాక్స్ షోలలో కల్కి ప్రదర్శితం కానుంది. ఓవర్సీస్ లో రికార్డులను బ్రేక్ చేసింది. ఇకపోతే ప్రభాస్ మాత్రం సినిమా రెస్పాన్స్ ను స్వయంగా చూడకుండా సినిమా విడుదలకు ముందే యూరప్ ట్రిప్ కు వెళ్ళబోతున్నాడని ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది.. మరి డార్లింగ్ ఎప్పుడు వెళ్తున్నాడో ఇంకా తెలియదు.. కానీ ఈ వార్త నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.. ఇప్పటికే ఈ సినిమాకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాడనే టాక్ ను అందుకున్నాడు.. మరి ఏ స్థాయి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు