Vijay Thalapathy : విజయ్ సినిమాను డైరెక్ట్ చేస్తానంటున్న స్టార్ క్రికెటర్.. ఆ కోరిక తీరడం కష్టమే..

Vijay Thalapathy : మన దేశంలో సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో అంతకు మించి క్రికెట్ కు యూత్ లో మంచి ఆదరణ ఉంది.. సినిమా వాళ్లు క్రికెట్ ఆడటం కష్టం కానీ క్రికెటర్స్ సినిమాల్లో సులువుగా నటిస్తున్నారు.. ఈ మధ్య కొంతమంది క్రికెటర్స్ సినిమాలను నిర్మిస్తున్నారు. మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని మొన్నా మధ్య ఓ సినిమాను నిర్మించారు. ఇప్పుడు మరో క్రికెటర్ సినిమాల ఆసక్తి ఉన్నట్లు ప్రకటించాడు.. అంతేకాదు తమిళ స్టార్ హీరో విజయ్ దళపతితో సినిమాను డైరెక్ట్ చెయ్యనున్నాడనే వార్త ఒకటి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. అయితే విజయ్ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు.. మరి అతని కోరిక తీరుందా అనేది ప్రశ్నలానే ఉండిపోతుందని టాక్..

ఆ స్టార్ క్రికెటర్ ఎవరో కాదు వరుణ్ చక్రవర్తి.. తమిళనాడుకు చెందిన ఈ యంగ్ క్రికెటర్ kkr తరపున ఆడాడు. తాజాగా జరిగిన ఐపీఎల్ లో తన సత్తాను చాటుతూ అద్భుతమైన ఆటతో అందరిని ఆశ్చర్యపరిచాడు.. కప్పు కొట్టడంలో తన పాత్ర ఎంతో ఉంది.. ఒక్కో మ్యాచ్ లో విజ్రూంభించాడు.. ప్రస్తుతం తర్వాత మ్యాచ్ లకు ప్రిపేర్ అవుతున్నాడు.. అయితే వరుణ్ ఇటీవల రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానెల్ కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు.. ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఎన్నో విషయాలను బయట పెట్టాడు..

Cricketer Varun Chakravarthy is said to direct Vijay talapathy's film
Cricketer Varun Chakravarthy is said to direct Vijay talapathy’s film

ఆ ఇంటర్వ్యూ లో వరుణ్ మాట్లాడుతూ.. నాకు చిన్నప్పటి నుంచి చాలా డ్రీమ్స్ ఉండేవి.. కొన్ని గోల్స్ కూడా ఉన్నాయి.. వాటిని నెరవేర్చుకోవడం కోసం ప్రయత్నిస్తున్నా అని చెప్పాడు.. అలాగే తనకు సినిమాలు తియ్యడం అంటే చాలా ఇష్టం అన్న సంగతి బయట పెట్టాడు… అతను సినిమాలకు స్టోరీలు రాయడం ఇష్టం.. అటుగా కూడా అడుగులు వేస్తానని చెప్పాడు.. తనకు తమిళ హీరో విజయ్ అంటే చాలా ఇష్టం అన్న విషయం అందరికీ తెలిసిందే.. గతంలో విజయ్ తో పాటుగా చాలా మంది తమిళ హీరోలను కలిసాడు.. విజయ్ తో ఒక సినిమా తియ్యాలనే కోరిక ఉన్నట్లు మొత్తానికి బయట పెట్టేశాడు..

- Advertisement -

ఈ యంగ్ క్రికెటర్ లో ఈ టాలెంట్ కూడా ఉందా అని ఫ్యాన్స్ ఆశ్చర్యపడుతున్నారు.. కొందరు అతను మంచి సినిమాలు చేసి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు.. ఇక విజయ్ దళపతి ది గోట్ సినిమా తర్వాత సినిమాలు చెయ్యబోనని ప్రకటించారు.. ప్రస్తుతం రాజకీయాల్లో రానించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.. మరి వరుణ్ కోరిక తీరడమే కష్టమే.. మరి విజయ్ అతని కోరికను తీరుస్తాడేమో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు