Darling: ప్రియదర్శి, నభా నటేష్‌ల డార్లింగ్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ !

Darling: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కమెడియన్ గా తన కెరియర్ ప్రారంభించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ప్రియదర్శి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జాతి రత్నాలు సినిమాతో ప్రియదర్శి విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆ సినిమా అనంతరం ప్రియదర్శికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు. పెళ్లిచూపులు చిత్రం నుంచి తాజాగా రిలీజ్ అయిన ఓం భీమ్ బుష్ వరకు చాలా సినిమాల్లో ప్రియదర్శి కమెడియన్ గా, సపోర్టింగ్ పాత్రలలో కనిపించి మెప్పించారు.

2019లో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన మల్లేశం సినిమా వచ్చింది. తన యాక్టింగ్ టాలెంట్ ను, కామెడీనే కాకుండా తాను ఎమోషనల్ క్యారెక్టర్లలో కూడా చేయగలనని ఆ సినిమాతో ప్రియదర్శి నిరూపించుకున్నారు. 2023 సంవత్సరంలో ప్రియదర్శి హీరోగా నటించిన బలగం సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. జాతి రత్నాలు సినిమాలోని మెయిన్ రోల్ లో కనిపించారు. ఈ క్రమంలోనే ప్రియదర్శి తాజాగా ఓ సినిమాలో నటించారు. ఈ సినిమాకు డార్లింగ్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇక సబ్ టైటిల్ వై దిస్ కొలవెరి అని జత చేశారు.

Darling: ది మ్యాడ్‌మాక్స్ మ్యారేజ్ ఎంటర్‌టైనర్.. డార్లింగ్ రిలీజ్ ఆరోజే..? - Rtvlive.com
ఈ సినిమాలో ప్రియదర్శి, నబ్బా నటేష్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేస్తూ ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. అమ్మ, చెల్లి, ప్రియురాలు గురించి ఎంతో అందంగా చెప్పినటువంటి ప్రియదర్శి…. భార్య గురించి చెబుతూ భయపడిపోతాడు. భార్యాభర్తల మధ్య జరిగే ఫన్నీ గొడవల నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు.

- Advertisement -

అలాగే పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ హిట్ హనుమాన్ సినిమాని అందించిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో అనన్య నాగళ్ళ, కృష్ణ తేజ, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమా జూలై 19వ తేదీన విడుదల కాబోతున్నట్టు తెలియజేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా కోసం ప్రియదర్శి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు