Prabhas: డార్లింగ్ మీరు ఏ సినిమా తీస్తున్నారో మీకు తెలుసా.? అప్పుడు రాజమౌళి ఇప్పుడు నాగ్ అశ్విన్

Prabhas: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న పాన్ ఇండియా స్టార్ట్ హీరోస్లో ప్రభాస్ ఒకరు. ఈశ్వర్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్. అయితే ఆ సినిమా ఊహించిన విజయాన్ని సాధించుకోలేకపోయింది. ఎట్టకేలకు వర్షం సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు ప్రభాస్. ఆ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు ప్రభాస్ కు వచ్చాయి. ఆ టైంలోనే అశ్విని దత్ ప్రభాస్ తో సినిమాలు చేయాలని ప్రయత్నించారు కానీ కుదరలేదు. ఎస్ ఎస్ రాజమౌళి కూడా సింహాద్రి అనే సినిమాను ప్రభాస్ తో చేయాలి అని అనుకున్నాడు. కానీ వర్కౌట్ కాలేదు.

ఇకపోతే ప్రభాస్ కి మంచి స్టార్డం తీసుకొచ్చిన సినిమా అంటే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలమైన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇకపోతే ఆ తర్వాత వచ్చిన డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ , మిర్చి వంటి ఎన్నో సినిమాలు ప్రభాస్ ని ప్రేక్షకులకు దగ్గర చేశాయి. ఇక ప్రభాస్ కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ప్రభాస్ కు తయారయ్యారు.

Prabhas

- Advertisement -

బాహుబలి సినిమా కేవలం ప్రభాస్ కు మంచి క్రేజ్ తీసుకురావడమే కాకుండా, తెలుగు సినిమా స్థాయిని కూడా అమాంతం పెంచేసింది. బాహుబలి సినిమా దాదాపు 5 ఏళ్ల పాటు తెరకెక్కించాడు జక్కన్న. అయితే ఈ ప్రాసెస్లో జక్కన్న చాలాసార్లు ఆలోచనలో పడ్డాడట. ఆ టైంలో ప్రభాస్ డార్లింగ్ మీరు ఏ సినిమా చేస్తున్నారో మీకు తెలుసా? మీరు చేస్తున్నది మాములు రేంజ్ సినిమా కాదు అంటూ నిలబడేవాడు అంట. ఇప్పుడు ఇదే విషయాన్ని నాగ్ అశ్విన్ కూడా చెప్పుకొచ్చాడు. అయితే అప్పుడు రాజమౌళికి బాహుబలి రూపంలో కిట్టు వచ్చిన ఇప్పుడు నాగ్ అశ్విన్ కి కల్కి రూపంలో హిట్ వచ్చిన ఆ క్రెడిట్ కంప్లీట్ గా ప్రభాస్ కి వెళ్తుంది అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు