Darling 2024 : సెన్సార్ సర్టిఫికెట్ పొందిన డార్లింగ్… రన్ టైం ఎంతంటే?

Darling 2024 : టాలీవుడ్ లో ప్రస్తుతం అంతా కల్కి మేనియా నడుస్తోందన్న విషయం తెలిసిందే. సరిగ్గా రెండు వారాల కింద విడుదలైన కల్కి చాలా రోజుల తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇక ఇప్పటికి ఈ ఊపు కొనసాగుతుండగా, ఈ వారం ఇండియన్2 థియేటర్లలో విడుదల కానుంది. అయితే వచ్చే వారం ఒక చిన్న తెలుగు సినిమా విడుదల కావడానికి రెడీ అవుతుంది. అదే ‘డార్లింగ్’ సినిమా. ప్రియదర్శి హీరోగా నటించిన ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇక చిన్న సినిమా అయినా ఈ సినిమాపై మంచి అంచనాలు ప్రేక్షకుల్లో ఉండగా, రీసెంట్ గా విడుదలైన డార్లింగ్ ట్రైలర్ కూడా మంచి అంచనాలను పెంచేసింది. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ ని కూడా పొందింది.

Darling movie got U/A censor certificate, run time 2Hr 20mins

U/A పొందిన డార్లింగ్…

ప్రియదర్శి నటించిన డార్లింగ్ సినిమా తాజాగా సెన్సార్ కి వెళ్లగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. కాగా సినిమా రన్ టైం ని 2 గంటల 20 నిమిషాల నిడివితో ఉంటుందని డిసైడ్ చేసారు. ఇక ఈ సినిమాని దర్శకుడు అశ్విన్ రామ్ ఈ జనరేషన్ ప్రేక్షకులకు చాలా రిలేటెడ్ గా ఉండే కథను ఎంచుకున్నాడు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా యూత్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా మెప్పిస్తుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉన్నారు. ఇక ట్రైలర్ కూడా బాగా ఆకట్టుకోగా, సాంగ్స్ కూడా మెప్పించే విధంగా ఉన్నాయి.

- Advertisement -

జులై 19న రిలీజ్ కి రెడీ..

ఇక డార్లింగ్ సినిమాకి సంబంధించి ఇప్పటికే మేకర్స్ ప్రమోషన్లు మొదలుపెట్టగా, ప్రోమోల ద్వారా డీసెంట్ బజ్ ని క్రియేట్ చేసారు. ఇక హీరో ప్రియదర్శి తన సినీ ఇండస్ట్రీ క్లోజ్ ఫ్రెండ్స్ అయిన రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి వంటి వారితో సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందించగా, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ వారు నిర్మించిన ఈ చిత్రం జూలై 19న థియేటర్లలోకి రానుంది. ఇక ఇప్పటికే బలగం వంటి సూపర్ సక్సెస్ తో ఊపు మీదున్న ప్రియదర్శికి ఈ సినిమా కూడా హిట్టిచ్చిందంటే.. పూర్తిగా హీరోగా కొనసాగడం ఖాయమని చెప్పొచ్చు. అయితే దీనికి వారం ముందు విడుదల అవుతున్న ఇండియన్2 టాక్ ని బట్టి డార్లింగ్ సినిమా ఎలా ఆడుతుందో ఒక అంచనాకి రావచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు