Darling: డార్లింగ్ కోసం నాచురల్ స్టార్ నాని, ఎవరొచ్చినా కంటెంట్ ఉండాలి

Darling: తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన పెళ్లిచూపులు అనే సినిమాలో కౌశిక్ అనే పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు ప్రియదర్శి. ఆ సినిమా కంటే ముందే చాలా షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు కూడా. అయితే పెళ్లిచూపులు సినిమా ప్రియదర్శికి మంచి బ్రేక్ ఇచ్చింది. అక్కడితో ప్రియదర్శికి వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న దర్శకుల గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒక మంచి కాన్సెప్ట్ ని పట్టుకొని కేవలం ఒక నటుడును తీసుకొని తనను హీరోని చేసే ప్రయత్నాలు ఎప్పుడు నుంచో జరుగుతూ వస్తున్నాయి.

ఇకపోతే అలానే చాలా టీవీ షోస్ ద్వారా గుర్తింపు సాధించుకున్న చాలామంది నటులను కమెడియన్లను హీరోలను చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా చాలామంది కొత్త హీరోలు పుట్టుకొచ్చారు. అలానే ప్రియదర్శిని కూడా హీరోని చూస్తూ చాలామంది సినిమాలు చేయడం మొదలుపెట్టారు. ప్రియదర్శి హీరోగా మల్లేశం అనే ఒక సినిమాను కూడా చేశారు. ఆ తర్వాత వేణు దర్శకుడిగా ప్రియదర్శి హీరోగా బలగం అనే ఒక సినిమాను కూడా చేశారు. ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా ఎంత హిట్ సాధించాయి అనే విషయం పక్కనపెడితే ప్రియదర్శికి మంచి ప్రశంసలు తీసుకొచ్చి పెట్టాయి.

Darling

- Advertisement -

ఇక ప్రస్తుతం ప్రియదర్శి నబా నటేష్ జంటగా నటిస్తున్న సినిమా డార్లింగ్. ఈ సినిమా ట్రైలర్ రీసెంట్గా రిలీజ్ చేశారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను త్వరలో నిర్వహించనున్నారు. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు నాచురల్ స్టార్ నాని చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నారు. అయితే నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నాని ఒక సినిమాకి చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడు అంటే దాని వలన కూడా కొందరు సినిమా చూసి అవకాశం ఉంది. అయితే ఏదేమైనా సినిమాలో కంటెంట్ లేకపోతే మాత్రం చీఫ్ గెస్ట్ కి ఎవరు వచ్చినా కూడా అంతగా వర్కౌట్ అవ్వదు అనేది కొంతమంది అభిప్రాయం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు