Darshan Case : దర్శన్ ఖైదీ నెంబర్ కి పెరిగిన డిమాండ్… డి గ్యాంగ్ టైటిల్ రిజెక్ట్

Darshan Case : రేణుకా స్వామి హత్య కేసులో జైలుకెళ్లిన కన్నడ నటుడు దర్శన్ కు అక్కడ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఆయన ఖైదీ నెంబర్ కు మంచి డిమాండ్ ఏర్పడినట్టుగా తెలుస్తోంది. అలాగే దర్శన్ చేసిన ఈ పని వల్ల ఆయనతో ఎలాంటి సంబంధం లేని మరో సినిమాకు టైటిల్ కష్టాలు ఎదురయ్యాయి. మరి ఈ రెండు స్టోరీలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

దర్శన్ ఖైదీ నెంబర్ కు భారీ డిమాండ్

దర్శన్‌ని విపరీతంగా ప్రేమించే అభిమానులు ఉన్నారు. ఇటీవల హత్య కేసులో నిందితుడిగా దర్శన్ జైలుకెళ్లినా.. కొందరు అభిమానులు ఆయనను అభిమానించడం మాత్రం మానలేదు. ఆశ్చర్యం ఏంటంటే.. జైల్లో దర్శన్ కు ఇచ్చిన ఖైదీ నంబర్ (దర్శన్ జైల్ నంబర్) ఇప్పుడు అభిమానులకు లక్కీ నంబర్ గా మారడం! రేణుకా స్వామి హత్య కేసులో ఏ2గా ఉన్న దర్శన్‌ను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ప్రస్తుతం పరప్పన అగ్రహార జైలులో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నాడు. అతనికి ఖైదీ నంబర్ 6106ను ఇచ్చారు జైలు అధికారులు. దీంతో ఇదే నెంబర్ తో కొత్త వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కొందరు దర్శన్ ఫ్యాన్స్ తో పాటు మిగిలిన వారు కూడా పోటీ పడుతున్నారట. అయితే ఓ అభిమాని మాత్రం ఈ నెంబర్ ను తన కారు నెంబర్ గా రిజిస్టర్ చేయించారని సమాచారం.

దర్శన్ ఖైదీ నెం. 6106; ఈ సంఖ్యలో వాహనాల రిజిస్ట్రేషన్‌కు డిమాండ్ పెరిగింది

- Advertisement -

డి గ్యాంగ్ టైటిల్ రిజెక్ట్

కాగా దర్శన్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో పలు విస్తుపోయే నిజాలు బయటకు వస్తుండగా, ఆయనకు సంబంధం లేని విషయాల్లో కూడా దర్శన్ వల్ల ఊహించని ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రేణుకా స్వామి మర్డర్ కేసులో ఏకంగా 17 మంది ప్రమేయం ఉండగా, వీళ్లందర్నీ కలిపి డీ గ్యాంగ్ అని పిలవడం మొదలు పెట్టారు. అంటే దర్శన్ గ్యాంగ్ అని అర్థం. దీంతో డీ గ్యాంగ్ అనే పేరుకు కూడా అనూహ్యంగా డిమాండ్ ఏర్పడింది. సోషల్ మీడియాలో కూడా ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. అదే పేరును తమ సినిమా టైటిల్ గా రిజిస్టర్ చేసుకోవడానికి ట్రై చేసిన ఓ మూవీ మేకర్స్ కు తాజాగా షాక్ ఇచ్చారు ఫిల్మ్ ఛాంబర్ వారు.

నిర్మాణ సంస్థ పిఎం ఫిల్మ్స్‌కు చెందిన నిర్మాత మంజు ఎన్ నాయక్ ‘డి గ్యాంగ్’ అనే టైటిల్ ను నమోదు చేయడం కోసం కర్ణాటక ఫిల్మ్ కామర్స్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఈ పేరు పెట్టలేమని చాంబర్ ఆఫ్ కామర్స్ చెప్పిందని ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా తెలిపారు. ఎందుకు ఈ టైటిల్ ను పెట్టుకోకూడదు అనే విషయమపై బోర్డు స్పష్టమైన కారణం చెప్పలేదని ఆరోపించారు. నిర్మాత మాట్లాడుతూ ‘డి గ్యాంగ్’ పేరుపై ఫిల్మ్ ఛాంబర్ లో ఆరా తీస్తే.. ఇంకా ఎవ్వరూ ఆ టైటిల్ రిజిస్టర్ చేయలేదు. దాదాపు రెండేళ్లుగా ఈ టైటిల్ కోసం వర్క్ చేస్తున్నాం. అందుకు నిదర్శనంగా ‘డి గ్యాంగ్’ పాటను యూట్యూబ్‌లో విడుదల చేశాము. దర్శన్ కేసుకు మా టైటిల్‌కు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఫిల్మ్‌ కామర్స్‌ బోర్డ్‌ వారు మా టైటిల్‌ను రిజిస్టర్‌ చేయలేమని ఎందుకు చెప్పారో నాకు అర్థం కాలేదు. ఒకవేళ ఇదే టైటిల్ ను పెద్ద నిర్మాతలు తీసుకుంటే మా ప్రయత్నం అంతా వృథా అవుతుంది అని అన్నారు. సదరు సినిమాకు దర్శకత్వం వహించాలనుకుంటున్న రాఖీ సోమ్లీ ‘డి గ్యాంగ్‌’ పేరును పెట్టుకుని కథ, సినిమాటోగ్రఫీని రూపొందించినట్లు పేర్కొంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు