Darshan Case : దర్శన్ పై రివేంజ్ తీర్చుకుంటున్న హీరోయిన్… అతనికి ఎన్ని శిక్షలు పడాలో కోరుతూ పోస్ట్

Darshan Case : కన్నడ స్టార్ హీరో దర్శన్ రేణుక స్వామి అనే అభిమాని హత్య కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆయన ప్రియురాలు, నటి పవిత్ర గౌడకు అసభ్యకరమైన మెసేజ్ పంపాడనే  కారణంతో అతన్ని కిడ్నాప్ చేయించి, దారుణంగా కొట్టి మురికి కాలువలో పడేశారు. ఆ తర్వాత శవాన్ని కుక్కలు ఈడ్చుకెళ్లడంతో విషయం బయటపడింది. ఈ కేసులో ఏ1, ఏ2గా ఉన్న ఇద్దరు నిందితులైన దర్శన్, పవిత్ర గౌడను రిమాండ్ కి తరలించారు. ఈ నేపథ్యంలోనే ఓ హీరోయిన్ దర్శన్ పై రివెంజ్ తీర్చుకుంటోంది.

దర్శన్ పై హీరోయిన్ రివెంజ్

దర్శన్ పై ఇప్పటికే తీవ్రమైన అభియోగాలు మోపడంతో పోలీసులు సెక్షన్ 302 (హత్య), 369 (కిడ్నాప్)తో పాటే ఆయా సెక్షన్లపై కేసు నమోదు చేశారు. సెక్షన్ 302 ప్రకారం దర్శన్‌కు యావజ్జీవ కారాగార శిక్ష లేదా మరణశిక్ష విధించబడుతుందని తెలుస్తోంది. దీని గురించి బయటకు రావడంతో ఆయనకు ఎలాంటి శిక్ష పడుతుందనే విషయంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. అయితే సోషల్ మీడియాలో దర్శన్ పై ఏఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అనే విషయాన్ని తెలియజేస్తూ ఓ వ్యక్తి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ను రీప్లేట్ చేస్తూ రమ్య చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఈ కేసులో దర్శన్ దోషిగా తేలకపోతే డబ్బు పని చేసిందని అర్థం. అంటే భారతీయ న్యాయ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో మనం చూడొచ్చన్నమాట. బాధితులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం రమ్య చేసిన ట్వీట్స్ సంచలనంగా మారింది.

Actress Ramya: ದರ್ಶನ್‌ಗೆ ಜೀವಾವಧಿ ಶಿಕ್ಷೆ ಅಥವಾ ಮರಣದಂಡನೆ ಶಿಕ್ಷೆಯ ಸುದ್ದಿ  ರಿಟ್ವೀಟ್ ಮಾಡಿದ ನಟಿ ರಮ್ಯಾ | Actress Ramya retweeted a tweet that said Darshan  should be punished life imprisonment or ...

- Advertisement -

రమ్యకు దర్శన్ తో గొడవేంటి ?

కన్నడలో దర్శన్ స్టార్ హీరో అయినప్పటికీ అతను అడుగుపెడితే చాలు వివాదమే అన్నట్టుగా ఉండేది పరిస్థితి. ఇప్పటిదాకా ఎన్నో వివాదాలలో చిక్కుకున్న దర్శన్ వల్ల ఒకానొక సందర్భంలో రమ్య కూడా బాగా హర్ట్ అయ్యింది. దత్త అనే సినిమాలో రమ్య, దర్శన్ కలిసే నటించారు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పటికీ వీరిద్దరూ స్నేహితులు మాత్రం కాలేదు. ఒకానొక సమయంలో దర్శన్ అభిమానులు రమ్యను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. దీనంతటికీ కారణం పునీత్ రాజ్ కుమార్, దర్శన్ అభిమానులకు మధ్య జరిగిన గొడవ.

గతంలో ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో దర్శన్ పై ఒక వ్యక్తి చెప్పు విసరడంతో వివాదం మొదలైంది. దర్శన్ ఫాన్స్ ఈ సంఘటనకు  పునీత్ రాజకుమార్ అభిమానులు కారణం అంటూ ఆరోపణలు చేయగా, పునీత్ అభిమానులు మాత్రం దర్శన్ అభిమానులే ఇలా చేశారని తిప్పి కొట్టారు. ఆ సమయంలో చాలామంది దర్శన్ కి సపోర్ట్ చేశారు. అయితే రమ్య అభిమానులను అదుపులో పెట్టడం అనేది స్టార్స్ బాధ్యత అంటూ ట్వీట్ చేసింది. ఫాన్స్ క్లబ్ ముసుగులో పేరు, రూపం లేకుండా ఇతరులను అత్యంత దారుణంగా, అభ్యంతరకరమైన పదజాలంతో తిడుతున్నారు అంటూనే స్టార్స్ తమ అభిమానులను అదుపులో పెట్టుకుంటే మంచిది అనే విధంగా ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ ను తప్పుగా అర్థం చేసుకున్న దర్శన్ అభిమానులు రమ్యపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. అయితే ఈ విషయంలో దర్శన్ కనీసం స్పందించకపోవడంతో రమ్య అసంతృప్తికి గురైంది. ఈ నేపథ్యంలోనే దర్శన్ కు శిక్ష పడాల్సిందే అన్నట్టుగా ట్వీట్ చేసి రివేంజ్ తీర్చుకుంది. కానీ ఎక్కడా ఆయన పేరును మాత్రం మెన్షన్ చేయలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు