Darshan : మర్డరర్ కి పెరుగుతున్న సపోర్ట్… జైలుకు వెళ్లి మరీ కలిసిన స్టార్ డైరెక్టర్

Darshan.. అభిమాని రేణుక స్వామి హత్య కేసులో A2 ముద్దాయిగా అరెస్టయి జైల్లో ఉన్న హీరో దర్శన్ కోసం.. ఒక స్టార్ డైరెక్టర్ జైలుకెళ్లారు అంటూ ఒక వార్త ఇప్పుడు సంచలనం సృష్టించడమే కాదు ఆ ఫోటోలు మరింత వైరల్ గా మారుతున్నాయి. మరి దర్శన్ కోసం జైలుకెళ్ళిన ఆ డైరెక్టర్ ఎవరు? అసలు ఎందుకు వెళ్లారు? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

Darshan: Increasing support for Murderer...star director who went to jail and met a lot..
Darshan: Increasing support for Murderer…star director who went to jail and met a lot..

దర్శన్ కోసం జైలుకెళ్లిన డైరెక్టర్..

అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో హీరో దర్శన్ అరెస్ట్ అయినప్పటికీ , పలువురు దర్శన్ అభిమానులు, సెలబ్రిటీలు మాత్రం ఇంకా దర్శన్ కు సపోర్టు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు కూడా జైలుకెళ్లి మరీ దర్శన్ ను కలుస్తున్నారు. ఈ క్రమంలోనే దర్శన్ స్నేహితుడు, ప్రముఖ నటుడు, డైరెక్టర్ తరుణ్ సుధీర్ తాజాగా జైలు కెళ్ళి సుదీర్ ని కలిశాడు. ఈ విషయంపై ఇప్పుడు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి . ఇక అసలు విషయంలోకి వెళితే తరుణ్ సుధీర్ దర్శకత్వంలో దర్శన్ గతంలో ఒక సినిమాలో నటించాడు. వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం కూడా ఉంది. ఈ క్రమంలోనే ఆగస్టు లో తరుణ్ పెళ్లి ఉండడంతో దర్శన్ ను పెళ్లికి పిలవడానికి జైలుకు వెళ్లాడు తరుణ్ సుధీర్. జైల్లో దర్శన్ ను కలిసిన తరుణ్ తన పెళ్లి పత్రిక ఇచ్చి వివాహానికి రావాలని ఆహ్వానించాడు.. అంతే కాదు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే నా స్నేహితుడు, మీ అభిమాన హీరో నిరపరాధిగా బయటకి వస్తాడు అంటూ తెలియజేశారు తరుణ్ సుధీర్. దీంతో అభిమానులు సైతం ఖుషీ అవుతున్నారు. అంతేకాదు డైరెక్టర్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నందుకు ఈయనకు..ముందస్తుగా పెళ్లిరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు.

మీడియాతో మాట్లాడిన డైరెక్టర్ తరుణ్ సుధీర్..

ఇకపోతే మీడియాతో మాట్లాడుతూ.. ఎప్పటిలాగే దర్శన్ నవ్వుతూ పలకరించాడు.. ఆయన ఆరోగ్యం బాగోలేదు కాబోలు.. ఆయన అరెస్ట్ అయిన తర్వాత మేమంతా కూడా ఏదో కోల్పోయాము అనిపిస్తోంది .నిజానికి దర్శన్ ఏ తప్పు చేయలేదు అని నాకు తెలుసు. కానీ అన్ని ఆధారాలు దర్శన్ కు వ్యతిరేకంగా ఉండడం వల్లే ఆయన జైల్లో ఉండాల్సి వస్తోంది. అంతేకాదు నా పెళ్లి విషయంలో దర్శన్ నాకు సలహాలు ఇచ్చాడు. ఇక ఆ సూచనలను దృష్టిలో పెట్టుకొని నేను ఇప్పుడు నా పెళ్ళికి సిద్ధం అవుతున్నాను.అందులో భాగంగానే నా పెళ్ళికి ఇప్పుడు దర్శన్ ను ఆహ్వానించడానికి వెళ్ళాను. సాధ్యమైనంత వరకు నా పెళ్లి జరిగే సమయానికి నిరపరాధిగా బయటకు వచ్చి, ఆయన నా పెళ్ళికి హాజరవుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను అంటూ తెలిపారు డైరెక్టర్ తరుణ్ సుధీర్.. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి దర్శన్ నిరపరాధికారి ఎప్పుడు బయటకు వస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు