Darshan Manager Suicide: సూసైడ్ చేసుకున్న దర్శన్ మేనేజర్. ఏమైందంటే..?

Darshan Manager Suicide.. కన్నడ హీరో దర్శన్ ప్రస్తుతం హత్య కేసులో ఇరుక్కుని భారీ పాపులారిటీ దక్కించుకున్నారు.. అటు కన్నడ , ఇటు తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఈయన పేరే మారుమ్రోగుతోంది. ప్రియురాలి కోసం ఏకంగా వీరాభిమానిని.. రూ.30 లక్షల సుఫారీ ఇచ్చి మరీ హతమార్చారు దర్శన్.. ఈ కేసులోనే అటు దర్శన్ ఇటు ఆయన ప్రియురాలు ప్రముఖ నటి పవిత్ర గౌడ కూడా అరెస్టు అయ్యారు. ఇది ఇలా ఉండగా తాజా దర్శన్ మేనేజర్ కూడా సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం.. ఇక ఈ విషయం తెలిసి ఇండస్ట్రీ సైతం ఉలిక్కిపడింది. మరి అసలు విషయం ఏమిటి? దర్శన్ మేనేజర్ ఆత్మహత్య వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.

దర్శన్ మేనేజర్ సూసైడ్..

Darshan Manager Suicide: Darshan Manager committed suicide. What happened..?
Darshan Manager Suicide: Darshan Manager committed suicide. What happened..?

దర్శన్ కు చెందిన బెంగళూరు ఫామ్ హౌస్ ను చూసుకునే మేనేజర్ శ్రీధర్ తాజాగా ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఆయన మృతదేహాన్ని ఫామ్హౌస్ సమీపంలోనే స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.. ఇక అక్కడ ఆత్మహత్య సమయంలో సూసైడ్ నోట్ తో పాటు వీడియో సందేశం కూడా లభించాయి.. ఒంటరితనం కారణంగానే తను ఆత్మహత్య చేసుకుంటున్నానని.. దీనికి తన బంధువులకు, స్నేహితులకు ఎటువంటి సంబంధం లేదని ఆ నోట్, వీడియోలో తెలిపారు శ్రీధర్..

కొత్త అనుమానాలకు తావు..

అయితే ఒకవైపు దర్శన్ కేసు కోర్టులో నడుస్తున్న సమయంలోనే.. ఆయన మేనేజర్ ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులకు అనుమానాన్ని కలిగిస్తోంది.అందుకే శ్రీధర్ ఆత్మహత్యకు, రేణుకా స్వామి హత్యకు ఏదైనా లింకు ఉందా? అనే కోణంలో పోలీసులు కూడా విచారిస్తున్నారు. మరి నిజంగానే శ్రీధర్ ఒంటరితనాన్ని భరించలేక సూసైడ్ చేసుకున్నారా? లేక రేణుకా స్వామి హత్య కేసులో ఈయన హస్తం కూడా ఉందా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఈ కోణంలోనే ప్రస్తుతం పోలీసులు ఆరాతీస్తున్నారు. ఇక నిజానిజాలు త్వరలోనే పోలీసులు తేల్చనున్నారు.

- Advertisement -

రేణుకా స్వామి కేసులో కొత్త మలుపు..

ఇకపోతే రేణుకా స్వామి హత్య కేసులో రోజుకొక కోణం వెలుగులోకి వస్తోంది.. ఇప్పటికే రేణుకా స్వామి హత్య కేసులో మొత్తం 16 మంది అరెస్టయ్యారు.. ఇక రేణుకా స్వామి చనిపోవడానికి ముందు.. బిర్యానీ తినిపించి.. ఆ తర్వాత కిడ్నాప్ చేసి.. కరెంటు షాక్ పెట్టి.. చిత్రహింసలకు గురిచేసినట్లు పోస్టుమార్టం నివేదికలో వెళ్లడైంది.. అంతేకాదు కర్రలు, పైపులు, రాడ్లతో, బెల్టులతో కొట్టడంతో.. తీవ్ర రక్తస్రావం అయ్యి చనిపోయినట్లు తేలింది.. ఇదిలా ఉండగా మరొకవైపు పోలీసుల దర్యాప్తులో భాగంగా పవిత్ర గౌడ ఇంట్లో సోదాలు చేశారు. ఆర్ ఆర్ నగర్ లో ఉన్న పవిత్ర గౌడ ఇంటికి వెళ్లి ఆమెను, ఆమె అనుచరుడు పవన్ ను కూడా పోలీసులు తీసుకెళ్లారు. హత్య జరిగిన సమయంలో ఆమె వినియోగించిన దుస్తులు , చెప్పులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ హత్యకు అనుకరించిన పవిత్ర గౌడ మేనేజర్ దేవరాజు ను కూడా అరెస్టు చేశారు.. ఇక రేణుకా స్వామి ఉంగరం, చైన్ వంటి వస్తువులను, నిందితులు లాక్కున్నట్లు తెలుస్తోంది.. అయితే మరోవైపు అరెస్టుపై కన్నడ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే కస్తూరి, ఉపేంద్ర లు కూడా దర్శన్ కు మద్దతుగా నిలుస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు