Darshan Murder Case : దర్శన్ పై ఇన్ని సెక్షన్లతో కేసులా… ఒక్కో దానికి ఒక్కో శిక్ష

Darshan Murder Case : దర్శన మర్డర్ కేసులో దారుణమైన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. రేణుక స్వామిని అత్యంత క్రూరంగా హింసించి చంపినట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే దర్శన్ కేసులో పోలీసులు మరిన్ని సెక్షన్లు చేర్చినట్టు సమాచారం. ఆయన మెడకు బిగుస్తున్న ఉచ్చు చూస్తే దర్శన్ ఇప్పట్లో బయటకు రావడం కష్టమేననే విషయం స్పష్టమవుతోంది. మరి దర్శన్ పై కొత్తగా చేర్చిన సెక్షన్లు ఏంటి? వాటికి శిక్షలు ఏంటో తెలుసుకుందాం పదండి.

దర్శన్ పై కొత్త కేసులు

దర్శన్ అండ్ టీమ్ పోలీసు కస్టడీ నేటితో అంటే జూన్ 20 తో ముగియనుంది. రేణుకా స్వామిని దర్శన్ అండ్ గ్యాంగ్ హత్య చేసిన కేసులో పోలీసులు మరిన్ని ఐపిసి సెక్షన్లు జోడించారు. ఈ కేసును లోతుగా విచారించి దర్శన్ పై అదనంగా ఎనిమిది సెక్షన్లను యాడ్ చేశారు పోలీస్ అధికారులు. అంతకుముందు పోలీసులు సెక్షన్ 302-హత్య, సెక్షన్ 201-సాక్ష్యాధారాల ధ్వంసం కింద కేసు నమోదు చేశారు. ఇప్పుడు కొత్తగా 8 ఐపీసీ సెక్షన్లు చేర్చగా, కొత్త సెక్షన్ల జోడింపుతో దర్శన్ చుట్టూ న్యాయపరమైన ఉచ్చు బిగుసుకుంది. ఇక కొత్త యాడ్ చేసిన సెక్షన్లలో 120B, 364, 355, 384, 143,147,148, R/W 149 ఉన్నాయి. నిందితుడి అరెస్టు తర్వాతే ఈ సెక్షన్లు చేర్చారు.

Darshan Thoogudeepa news: Filmmakers of Darshan's upcoming projects in tight spot

- Advertisement -

ఏ నేరం కింద ఈ సెక్షన్లు వేస్తారు ?

364- కిడ్నాప్, 384- బలవంతపు దోపిడీ, 355- నేరపూరిత బలవంతపు ఉపయోగం, 148- మారణాయుధాల వినియోగం, 120(బి), నేరపూరిత కుట్ర, 143- చట్టవిరుద్ధమైన సమావేశం, 147- అల్లర్లు, 148- మారణాయుధాలతో దాడి. r/w 149 సెక్షన్‌లు జోడించబడ్డాయి.

కొత్త సెక్షన్లకు శిక్ష ఏమిటి?

302 – హత్య – జీవిత ఖైదు, 364 – కిడ్నాప్ – జీవిత ఖైదు, 201 – సాక్ష్యాలను తారుమారు చేయడం – జీవిత ఖైదు, 120 బి – కుట్ర – 2 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ, 355 – నేరపూరిత బలవంతపు ఉపయోగం- 2 సంవత్సరాల జైలు శిక్ష, 384 – బలవంతపు దోపిడీ – 3 సంవత్సరాల జైలు శిక్ష, 143 – దౌర్జన్యాలు – 6 నెలల జైలు శిక్ష, 147 – అల్లర్లు – 2 సంవత్సరాల జైలు శిక్ష, 148 – మారణాయుధాల వినియోగం – 3 సంవత్సరాల జైలు శిక్ష, 149 – సామూహిక దాడి – 2 సంవత్సరాల జైలు శిక్ష.

ఈరోజు జైలుకు వెళ్లనున్న డి గ్యాంగ్?

చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్, ప్రియురాలు పవిత్ర గౌడ్ సహా 17 మంది నిందితుల పోలీసు కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో నిందితులను ఇవాళ మరోసారి కోర్టులో హాజరుపరచనున్నారు. దర్శన్‌తో పాటు ఇతర నిందితులు చాలా మంది ఈరోజు పరప్ప అగ్రహార జైలులో సెటిల్ అవుతారని చెబుతున్నారు. రేణుకాస్వామి హత్య కేసు దర్యాప్తు ఇప్పటికే తుది దశకు చేరుకుంది.

రేణుకాస్వామి హత్య జరిగిన ప్రదేశం, మృతదేహం లభ్యమైన ప్రదేశం, మృతదేహం లభించిన ప్రదేశాన్ని పోలీసులు విచారించారు. దీంతో పాటు నేరానికి ఉపయోగించిన పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అందుకే ఈరోజు దర్శన్‌ను కోర్టులో హాజరుపరిచి మళ్లీ కస్టడీ కోరడం అనుమానమేనని చెబుతున్నారు. దర్శన్ అండ్ గ్యాంగ్ పోలీసుల కస్టడీ ముగిసిన నేపథ్యంలో నిన్న 17 మంది నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. దర్శన్, పవిత్ర గౌడ సహా 17 మందికి విక్టోరియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. పవిత్రగౌడ్‌కు ఈసీజీ, బీపీ పల్స్‌ తనిఖీ చేశారు. ఈ నిందితులకు చిప్పకూడు ఖాయమేనని అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు