Darshan Murder Case : మర్డర్ టైంలో దర్శన్‌తో పాటు మరో 16 మంది… వెలుగులోకి వచ్చిన సంచలన నిజాలు

Darshan Murder Case : కన్నడ స్టార్ హీరో దర్శన్ రేణుక స్వామి అనే అభిమానిని హత్య చేయడం దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. దర్శన్, పవిత్ర గౌడ సహజీవనం చేయడం నచ్చని అతను సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేస్తున్నాడనే  కారణంతో చిత్రహింసలు పెట్టి చంపినట్టు తెలుస్తోంది. తాజాగా బయటకు వచ్చిన రేణుక స్వామి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.

కరెంట్ షాక్ ఇచ్చి చిత్రహింసలు…

రేణుక స్వామి హత్య కేసులో దర్శన్, పవిత్రలతో సహా 17 మందిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. అందరూ కలిసి రేణుక స్వామి హత్య కోసం కుట్ర పన్నినట్టు ఇప్పటికే రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు. ఇక పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం బాధితుడిని కట్టేసి కర్రలతో కొట్టడం మాత్రమే కాదు కరెంట్ షాక్ ఇచ్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. అతన్ని కిడ్నాప్ చేసి కట్టిపడేసిన షెడ్ లో రక్తపు మరకలు, క్యాబ్ లో అతని జుట్టు, ఇతర శరీర ద్రవాలను ఫోరెన్సిక్ నిపుణులు సేకరించారు. పోస్టుమార్టం రిపోర్ట్ లో ఏముందంటే… తల, పొత్తి కడుపులో గాయాలతో పాటు అంతర్గత రక్తస్రావం కారణంగా వేణు స్వామి మరణించినట్లు తెలుస్తోంది.

Did Actor Darshan Make Rs 30 Lakh Offer To Escape From Renuka Swamy Murder  Case? - Oneindia News

- Advertisement -

వెలుగులోకి షాకింగ్ నిజాలు…

ఘటన జరిగిన ప్రాంతం చుట్టుపక్కల సెక్యూరిటీ కెమెరా ఫుటేజీలలో దర్శన్ కు సంబంధించిన కార్లు రికార్డ్ అయ్యాయి. కాగా వేణు స్వామి బెంగళూరుకు కిడ్నాప్ చేసి తీసుకు వచ్చిన కారును చిత్రదుర్గ జిల్లాలోని అయ్యన్న హళ్లిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక రోజు రోజుకూ ఈ కేసులో వెలుగులోకి వస్తున్న నిజాలు గగుర్పాటుకు గురి చేస్తున్నాయి. పోలీసులు సైతం స్వామిని హత్య చేయడానికి దర్శన్ అండ్ టీం వేసిన ప్లాన్ తెలుసుకుని షాక్ అవుతున్నారు.

17 మందితో పక్కా ప్లాన్..

ఈ కేసులో ఉన్న వారంతా దర్శన్ అభిమానులు, సన్నిహితులే కావడం గమనార్హం. పథకం ప్రకారమే చిత్రదుర్గకు చెందిన వేణు స్వామిని బెంగళూరుకు తీసుకువచ్చి షెడ్ లో కట్టేసి చిత్రహింసలు పెట్టి మరీ దారుణంగా హతమార్చారు. ఇక ఈ ప్లాన్ లో కీలకమైన నలుగురు నిందితులను నెంబర్ 2గా పోలీసులు పేర్కొన్నారు. దర్శన్ నిందితులకు మొత్తం 50 లక్షలు చెల్లించాడని అనుమానిస్తున్నారు పోలీసులు.

ఒక్కడికే 30 లక్షలు

కిడ్నాప్, హత్య, మృతదేహాన్ని పారవేయడం వంటి పనులని చేయడానికి ప్రదోష (పవన్) అనే వ్యక్తికి చెల్లించిన 30 లక్షలు కూడా ఇందులోనే ఉన్నాయని భావిస్తున్నారు. రేణుక స్వామి మృతదేహాన్ని పారేయడంలో నిఖిల్, కేశవ మూర్తి కీలకంగా వ్యవహరించగా, వీరిద్దరికి ఒక్కొక్కరికి 5 లక్షలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక విషయం బయటకు వస్తే దర్శన్, పవిత్ర గౌడల స్థానంలో నేరాన్ని ఒప్పుకుని జైలుకు వెళ్లడానికి కార్తీక్, రాఘవేంద్ర అనే ఇద్దరు వ్యక్తుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షలు చెల్లించారనే షాకింగ్ విషయం బయటకు వచ్చింది. దాదాపుగా 72 గంటల పాటు ఈ కుట్ర సాగింది. కామాక్షి పాల్యకు వేణు స్వామి డెడ్ బాడీని డంప్ చేయడానికి రవి శంకర్ అనే వ్యక్తి టాక్సీని ఏర్పాటు చేసినట్లుగా తెలియగా, జూన్ 10న అతను స్వయంగా పోలీసుల దగ్గర లొంగిపోయాడు. ఇక నలుగురు నిందితులు రేణుక స్వామి కిడ్నాప్ హత్యను అంగీకరించినట్లు ఎసిపి చందన్ కుమార్ వెల్లడించారు. వీరితో పాటు దర్శన్, పవిత్ర గౌడలు ఈ హత్యలో ప్రధాన నిందితులు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు