Darshan: దర్శన్ కు కొత్త చిక్కులు.. బళ్లారి సెంట్రల్ జైలుకు తరలింపు..!

Darshan.. రేణుకా స్వామి (Renuka Swamy) హత్య కేసులో పరప్పన అగ్రహారంలో A2 నిందితుడిగా హీరో దర్శన్ (Darshan) జైలు పాలైన విషయం తెలిసిందే. అయితే అక్కడ దర్శన్ కు రాజ మర్యాదలు అందుతున్నట్లు ఆధారాలతో సహా రుజువయింది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోం మంత్రి జి.పరమేశ్వర్ (G.Parameswar )దీనిని సీరియస్ గా తీసుకొని దర్శన్ ను మరో జైలుకు తరలించినట్లు సమాచారం.

Darshan: New complications for Darshan.. Moved to Bellary Central Jail..!
Darshan: New complications for Darshan.. Moved to Bellary Central Jail..!

శిక్ష మరింత కఠిన తరం..

ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ తన స్వీయ తప్పిదాలతో మరిన్ని కష్టాలు కొని తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. పరప్పన అగ్రహారం జైలులో నిబంధనలు ఉల్లంఘించినందుకు అతనిని ఇప్పుడు మరో జైలుకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇక నుంచి దర్శన్ తన కుటుంబాన్ని కలవడం కష్టం అవుతుంది. అలాగే జైలు శిక్ష మరింత కఠిన తరం కానుంది అని సమాచారం. ఇకపోతే స్వీయ తప్పిదాల కారణంగా దర్శ మరో జైలుకు తరలించడం ఖాయం అంటూ వార్తలు వినిపించాయి ఈ మేరకు బెంగళూరులోని 24వ ఏసీ ఎంఎం కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దర్శన్ మాత్రమే కాదు రేణుకా స్వామి హత్య కేసులో నిందితులందరినీ కూడా వేరు వేరు జైలుకు తరలించనున్నారు. ఈ మేరకు పోలీసులకు కోర్టు నుండి ఆదేశాలు కూడా అందాయి.

బళ్లారి జైలుకు దర్శన్ ను తరలింపు..

ముఖ్యంగా నిందితులను బదిలీ చేయాలని చీప్ సూపర్డెంట్ కోర్టును ఆశ్రయించారు. వెంటనే ఉత్తర్వులు అందడంతో తరలింపు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ప్రధాన నిందితుడు దర్శన్ ..బళ్లారి జైల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణలకు హాజరయ్యే వ్యవస్థ ఉంది. కాగా దర్శన్ ను బళ్లారి జైలుకు, పవన్, రాఘవేంద్ర, నందీష్ లను మైసూర్ జైలుకు తరలించనున్నారు. ఇక జగదీష్ ను షిమోగా జైలుకు, ధనరాజ్ ను ధార్వాడ జైలుకు తరలించనున్నారు. అలాగే వినయ్ ని విజయపురి జైలుకు, నాగరాజును కలబురగి జైలుకి తరలించనున్నారు .వీరితోపాటు లక్ష్మన్ ను షిమోగా జైలుకు, ప్రదుష్ ను బెల్గాం జైలు కు తరలించనున్నట్లు సమాచారం.

- Advertisement -

బెయిల్ కోరిన పవిత్ర గౌడ..

ఇక మిగిలిన నిందితులు అనగా ఏ వన్ నిందితురాలు అయిన పవిత్ర గౌడ (Pavitra Gowda)ను పరప్పన అగ్రహారం లోనే కొనసాగించనున్నారు. అలాగే అను కుమార్ , దీపక్ కూడా ఇదే జైల్లో కొనసాగనున్నారు. ఇకపోతే పవిత్ర గౌడ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా విచారణను ఆగస్టు 28 కి మార్చారు. అంటే ఈరోజు ఈమెకు బెయిల్ రాబోతోందా లేదా అనే విషయం తెలియనుంది.

హీరో దర్శన్ కి జైల్లో రాజబోగాలు.

ఇదిలా ఉండగా గతంలో హీరో దర్శన్ కు రాజభోగాలు అందించిన నేపథ్యంలో ఏడుగురు పోలీసులను అధికారులు సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని మరిచేలోపే ఇప్పుడు మరొకసారి జల్సాలు చేస్తూ కనిపించారు దర్శన్. తాజాగా ఆయన ముగ్గురు స్నేహితులతో కలిసి ఒక చేతిలో సిగరెట్టు మరో చేతిలో కాఫీ కప్పు పట్టుకొని జల్సాగా ధీమాగా కుర్చీలో కూర్చొని ఫోటోలకు ఫోజులిచ్చారు. అవి కాస్త సోషల్ మీడియా ద్వారా బయటకు రావడంతో ఇది చూసిన అభిమానులు నిందితుడికి జైల్లో రాజ భోగాలు అంటూ కామెంట్లు చేయగా ఇది కాస్త ముఖ్యమంత్రిగా చేరడంతో ఇప్పుడు ఆయనను బల్లారి కి తరలిస్తున్నట్లు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు