Darshan: దర్శన్ కు జైల్లో రాజ భోగాలు, ఉలిక్కిపడ్డ కర్ణాటక ప్రభుత్వం

Darshan: చాలామంది హీరోలు స్టేజ్ ఎక్కిన ప్రతిసారి మేము ఈ స్థాయిలో ఉండటానికి కారణం మా అభిమానులు అని తెలుగు హీరోలు చెబుతూ ఉంటారు. అలానే ప్రేక్షకు దేవుళ్ళు అని అంటూ ఉంటారు. ఎందుకంటే ప్రేక్షకులు టికెట్ కొనుక్కొని సినిమా చూస్తేనే అది హిట్ అయి ప్రొడ్యూసర్ కి మంచి లాభాలు వచ్చి ఆ తర్వాత ఇండస్ట్రీ అంతా బాగుండే అవకాశాలు ఉంటాయి. తెలుగు ప్రేక్షకులు సినిమాని ఎంతగా ప్రేమిస్తారు అని చెప్పడానికి చాలా సినిమాల కలెక్షన్లు నిదర్శనం.

ఇక కన్నడ ఫిలిం ఇండస్ట్రీకి తన అభిమాని రేణుక స్వామిని(Renuka Swami) దర్శన్ హత్య చేయించిన విషయం చాలామందికి తెలిసిందే. ఎంత దారుణంగా హత్య చేశాడు ఆ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఇటువంటి ట్రీట్మెంట్ దర్శన్ కి కూడా ఉండాలి అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు కూడా వైరల్ గా మారాయి. అలానే దర్శన్ మీద ఉన్నవి తక్కువ కేసులు కూడా కాదు. జైలు దర్శన్ కొత్త కూడా కాదు. మామూలుగా జైలుకు వెళ్లాలంటే భయపడుతుంటారు. కొంతమంది సామాన్యులు తాము అన్యాయంగా జైల్లోకి వెళ్లి నరకం చూశారు అంటూ చెబుతూ ఉంటారు.

Darshan

- Advertisement -

కానీ హీరో దర్శన్(Darshan) కు మాత్రం అలా జరగడం లేదు. అంత పెద్ద తప్పు చేసినా కూడా జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్నాడు.ప్రస్తుతం ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జైల్లో చాలామందికి ఫోన్ కి అనుమతి ఇవ్వరు కానీ దర్శన్ మాత్రం వాట్సాప్ వీడియో కాల్స్ కూడా చేసుకుంటున్నాడు. దర్శన్ వాట్సాప్ వీడియో కాల్ బయటికి రావడంతో, జైలులోని నిజాలు బయటపడ్డాయి. జైల్లో గ్యాంగ్ స్టర్ ధర్మతో నిందుతుడు దర్శన్ మంతనాలు జరుపుతున్నాడు.
ఈ విషయం తెలిసిన వెంటనే ఒక్కసారిగా కర్ణాటక ప్రభుత్వం ఉలిక్కిపడింది. 7గురు పోలీసు సిబ్బందిపై వేటు వేసినట్లు సమాచారం తెలుస్తుంది.

అయితే ఇక పైన అయినా జైలు సిబ్బంది సీరియస్ గా దర్శన్ ను ట్రీట్ చేస్తే రేణుక స్వామికి న్యాయం జరిగినట్లు ఉంటుంది. అలానే ఇటువంటి పనులు చేయకుండా ముందు ముందు జాగ్రత్త పడే అవకాశం ఉంది. ఇలానే జైల్లో రాజభోగాలు అందిస్తూ ఉంటే ఇలాంటి రేణుక స్వాములు ఎంతోమంది హత్యకు గురవడం ఖాయం అనేది కొంతమంది వ్యక్తిగత అభిప్రాయం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు