Darshan : మీడియాకి మిడిల్ ఫింగర్ చూపించిన దర్శన్.. తప్పు చేసాడని కొంచెం కూడా ఫీలింగ్ లేనట్టుంది?

Darshan : కన్నడ స్టార్ హీరో దర్శన్ తన అభిమాని రేణుకాస్వామి (Renuka Swamy) హత్య కేసులో ఆరోపణలపై అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కన్నడనాట సంచలనం రేపిన ఈ హత్య కేసులో దర్శన్ అలాగే తన ప్రియురాలు పవిత్ర గౌడ నిందితులుగా అరెస్ట్ కాగా, మరో పద్నాలుగు మంది కూడా అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో దర్శన్ అరెస్ట్ అయిన రోజు నుండి కొన్ని వారాల పాటు రోజుకో ట్విస్ట్ తో కేసు ఎన్నో మలుపులు తిరుగుతుంది. ఈ కేసు ఇంకా కొలిక్కి రాకపోగా, దర్శన్ ప్రస్తుతం కర్ణాటకలో పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఇక రీసెంట్ గా దర్శన్ జైల్లో ఉన్న ఒక వీడియో కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ వీడియో లో జైల్లో ఉన్న దర్శన్ సిగిరెట్, చేతిలో కాఫీ కప్ తో కనిపించడం తో జైల్లో అతనికి రాచమర్యాదలు చేస్తున్నారని ప్రభుత్వం పైనా జనాలు సీరియస్ అయ్యారు.

Darshan showed the middle finger to the media

మీడియాకి మిడిల్ ఫింగర్ చూపించిన దర్శన్…

ఇక దర్శన్ (Darshan) కి సౌకర్యాలు అందించిన జైలు అధికారులపై ప్రభుత్వ అధికారులు చర్యలు కూడా తీసుకున్నారు. ఇక ప్రజల నుండి వ్యతిరేకత రావడంతో జైల్లో అతడ్ని గమనిస్తూ, స్పెషల్ టీమ్ ని కూడా నియమించింది కర్ణాటక ప్రభుత్వం. అయితే తాజాగా దర్శన్ జైల్ నుంచి విజిటింగ్ ఏరియాకు వెళ్తున్న క్రమంలో అక్కడ మీడియా అతన్ని కెమెరాలో చూపించగా, అక్కడ మీడియాకి దర్శన్ మిడ్ ఫింగర్ చూపిస్తూ వెళ్లాడు. మరీ పైకి చూపించకపోయినా కింది నుండి మిడిల్ ఫింగర్ చూపిస్తూ వెళ్ళిపోయాడు. అక్కడ దర్శన్ నడిచే తీరు, మిడిల్ ఫింగర్ చూపించిన విధానం చూస్తూనే అసలు దర్శన్ కి తప్పు చేశాననే భావన గాని, పశ్చాత్తపం గాని అస్సలు లేనట్టు ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

కేసులో యావజ్జీవాన్ని మించిన శిక్ష వేస్తారా?

ఇక దర్శన్ తాజాగా మీడియా తో ప్రవర్తించిన తీరుకు జనాలు సైతం నెట్టింట ఫైర్ అవుతున్నారు. ఇతనికి యావజ్జివ శిక్ష సరిపోదు, ఉరి శిక్షే సరైందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ కేసులో ఇంకా దర్శన్ కి శిక్ష విషయంలో కొలిక్కి రాలేదు. దర్శన్ తరపు లాయర్లు సుప్రీం కోర్టుకు వెళ్ళడానికి కూడా రెడీ అయ్యారు. ఇక దర్శన్, పవిత్ర (Pavitra gowda)లు తమ ఫ్యామిలీలను వదిలి మరీ ఈ ప్రేమ వ్యవహారం నడిపించగా, చివరకు రేణుకా స్వామి హత్యతో వీళ్ళ కెరీర్ ఎండ్ అయ్యే స్టేజికి వచ్చింది. ఇక దర్శన్ ని అభిమానించే వాళ్ళు కూడా బయట తిరగలేకపోతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు