Darshan: రేణుకా స్వామి హత్య కేసు నిందితుడి ఇంట్లో విషాదం.. అంతా ఆయన వల్లే..?

Darshan.. గత కొద్ది రోజుల నుంచి హీరో దర్శన్, పవిత్ర గౌడ, రేణుక స్వామి అనే పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తన ప్రియురాలు పవిత్ర గౌడ ను సోషల్ మీడియా వేదికగా ఒక అభిమాని వేధిస్తున్నాడని, హీరో దర్శన్ రేణుక స్వామిని అత్యంత దారుణంగా హత్య చేయడంతో ఒక్కసారిగా కన్నడ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. ప్రస్తుతం ఈ కేసులో దర్శన్ అగ్రహార జైలులో ఉంటున్నట్లు తెలుస్తోంది. పవిత్ర గౌడ కూడా జైలులో ఉన్నది.. ప్రస్తుతం వీరిద్దరూ కూడా బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వీరికి ఎదురుదెబ్బ తగులుతూనే ఉన్నది.

Darshan: The tragedy in the house of the accused in Renuka Swamy's murder case.. is it all because of him..?
Darshan: The tragedy in the house of the accused in Renuka Swamy’s murder case.. is it all because of him..?

నిందితుడు రఘు తల్లి మరణం..

ఆగస్టు ఒకటో తేదీ వరకు వీరికి బెయిల్ మంజూరు చేయకూడదంటూ కోర్టు పొడిగించింది.. అయితే రేణుక స్వామి హత్య కేసులో నిందితులైన వారి ఒకరి ఇంట్లో ఇప్పుడు తాజాగా విషాదం నెలకొన్నట్లు తెలుస్తోంది..A4 గా గుర్తించబడిన రఘు తల్లి మరణించిందట.. రఘు చిత్రదుర్గ దర్శన్ అభిమాని సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించేవారట.. రఘు తల్లి మంజుల నిన్నటి రోజున మరణించినట్లు తెలుస్తోంది. ఈమె తన ఇంట్లోనే మృతి చెందినట్లు సమాచారం.. ఒకవైపు అనారోగ్య సమస్యతో బాధపడుతూనే మరొకవైపు తన కుమారుడు జైల్లో ఉన్నాడనే ఆవేదనతో రఘు చిత్రదుర్గ తల్లి మరణించినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు.

మానసిక క్షోభ అనుభవించిన రఘు తల్లి..

తన కొడుకు జైలు పాలు అవ్వడం రఘు తల్లి అసలు ఊహించలేదని, ఈ కేసులో అరెస్ట్ అయినప్పటి నుంచి ఆమె చాలా మానసికంగా కృంగిపోయింది అంటూ అక్కడ ఉన్న ప్రజలు కూడా తెలియజేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ఈమెకు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయని, దీంతో ఆమె శ్వాస విడిచినట్లు స్థానికులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా రేణుక స్వామిని చిత్రదుర్గ బెంగళూరుకు తీసుకువచ్చి మరి చాలా దారుణంగా చంపారని ,దీంతో రఘును A4 ముద్దాయిగా చేర్చారు పోలీసులు..

- Advertisement -

నిందితుడు అనిల్ తండ్రి కూడా మరణం..

ఇదంతా ఇలా ఉండగా రవి మాత్రమే కాకుండా ఈ కేసులో పట్టుబడిన అనిల్ అనే నిందితుడు తండ్రి కూడా గడిచిన కొద్ది రోజుల క్రితం మరణించారు.. తన కొడుకు జైలు పాలు అవ్వడం చేత అనిల్ తండ్రి కూడా ఈ ఆవేదన తట్టుకోలేక మానసిక వేదనలతో మరణించారని అప్పట్లో వార్తలు వినిపించాయి. రేణుక స్వామి హత్య కేసులో ఇప్పటివరకు 17 కేసులు పైగా నమోదైనట్లు తెలుస్తోంది.. ఈ కేసులో ఉన్న వారందరిని వీరప్పన్ జైలుకి తరలించినట్లుగా సమాచారం.. జూలై 18 వరకు జ్యూడిషియల్ విధించగా ఇటీవల మళ్ళీ ఆగస్టు 1వ తేదీ వరకు కోర్టు పొడిగించినట్లు తెలుస్తోంది.

రేణుక స్వామి ఉసురు తగిలిందా..

మొత్తానికి అయితే రేణుక స్వామిని అత్యంత దారుణంగా చంపారు కాబట్టే కర్మ వెంటాడుతుంది అని, ఆయన శాపం తప్పకుండా వీరందరికీ తగులుతుందని కొంతమంది నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. అలాగే హీరో దర్శన్ తన ఇంటి నుంచి భోజనం తెప్పించాలంటూ కోర్టు అనుమతి ఇవ్వాలని దర్శన్ హైకోర్టులో పిటిషన్ వేసుకున్నప్పటి నుంచి తన ఇంటి నుంచి కొన్ని పుస్తకాలు , భోజనం, పరుపు , దిండు ఇతరత్రా వాటి విషయంలో విచారణ జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామంటూ కోర్టు తెలియజేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు