Deepika Padukone: మరో అరుదైన ఘనత సాధించిన దీపికా పదుకొనే.. ఏమిటంటే..?

Deepika Padukone.. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లిస్టులో మొదటి వరుసలో ఉండేటువంటి హీరోయిన్ లలో దీపికా పదుకొనే కూడా ఒకరు.. ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో అన్ని భాషలలో కూడా నటించేందుకు చాలా ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇటీవలే తెలుగులో కూడా ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాలో కూడా నటిస్తున్నది. హాలీవుడ్ లో కూడా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది దీపికా పదుకొనే. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి మరీ నటిస్తూ ఉంటుంది. అందుకే అభిమానులు ఈమె నటనకు ఫిదా అవుతూ ఉంటారు.

IMDB జాబితాలో దీపికా మొదటి స్థానం..

Deepika Padukone: Another rare achievement of Deepika Padukone.. What..?
Deepika Padukone: Another rare achievement of Deepika Padukone.. What..?

తాజాగా దీపికా పదుకొనే మరొక ఘనతను సాధించింది.. అదేమిటంటే IMDB రిలీజ్ చేసిన టాప్ 100 మంది భారతీయుల సెలబ్రిటీ జాబితాలో సైతం దీపికా పదుకొనే మొదటి స్థానాన్ని అందుకుంది.. ముఖ్యంగా షారుక్, సల్మాన్, అమీర్ ఖాన్ వంటి తారలను మించి మరీ మొదటి స్థానాన్ని అందుకోవడంతో దీపిక అభిమానులు సైతం చాలా సంబరపడిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా ఈ విషయాన్ని తెగ వైరల్ గా చేస్తూ ఉన్నారు. ఏప్రిల్ 2014 నుంచి ఏప్రిల్ 2024 వరకు IMDB వెబ్సైట్లో అత్యధికంగా సెర్చ్ చేసిన ప్రముఖుల జాబితాను తాజాగా విడుదల చేసింది.

IMDB జాబితాలో సెలబ్రిటీస్ వీళ్ళే..

ముఖ్యంగా ఐఎండిబి లో సినిమాలు, వెబ్ సిరీస్ లతో పాటు చాలామంది సెలెబ్రెటీల కు సంబంధించి పూర్తి వివరాలు ఉంటాయి. ఈ క్రమంలోనే అక్కడ దీపిక పదుకొనే పేజీని చాలామంది ఎక్కువగా వెతికినట్లు తెలియజేశారు.. మొదటి స్థానంలో దీపికా పదుకొనే ఉండగా… రెండవ స్థానంలో షారుఖ్ ఖాన్ ఉండగా.. మూడవ స్థానంలో ఐశ్వర్యారాయ్, నాలుగవ స్థానంలో ఆలియా భట్, ఐదవ స్థానంలో ఇర్ఫాన్, ఆరో స్థానంలో అమీర్ ఖాన్, ఏడవ స్థానంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్, ఎనిమిదో స్థానంలో సల్మాన్ ఖాన్, తొమ్మిదవ స్థానంలో హృతిక్ రోషన్, పదవ స్థానంలో అక్షయ్ కుమార్ స్థానాన్ని సంపాదించుకున్నారు. టాలీవుడ్ సమంత 13 , త్రిప్తి దిమ్రి 15, తమన్నా 16, నయనతార 18, ప్రభాస్ 29, రామ్ చరణ్ 31, హీరో మహేష్ బాబు 72, రష్మిక 78.. ప్రియమణి 79.. రకుల్ 82, త్రిష 84, మృణాల్ ఠాకూర్ 85, యష్ 89, అనుష్క శెట్టి 86 స్థానాలలో తదితరులు ఉన్నారు.

- Advertisement -

దీపిక సినిమాలు..

దీపికా పదుకొనే తన కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించింది. ఇటీవలే తను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని కూడా తెలియజేసి.. అభిమానులకు మరింత ఆనందాన్ని తెలియజేసింది. ప్రస్తుతం దీపికా పదుకొనే తన మొదటి బిడ్డ రాక కోసం చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తోంది. ప్రభాస్ తో నటించిన కల్కి 2898 AD సినిమా వచ్చే నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొత్తానికి అయితే ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది దీపికా పదుకొనే ఇప్పటికే తన సినిమాల ద్వారా బాలీవుడ్ లోనే కాదు హాలీవుడ్ ప్రేక్షకులను కూడా అలరించిన ఈమె ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు