Deepika Padukone Kalki pre-release event: ప్రభాస్ ఈ మాత్రం మాట్లాడడమే ఎక్కువ.. డార్లింగ్ పై కామెంట్స్ చేసిన దీపికా పదుకొనే..!

Deepika Padukone Kalki pre-release event: సినీ ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా కల్కి. భారత పురాణాల స్ఫూర్తితో ఈ మూవీ రూపొందిన సంగతి తెలిసిందే. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రంలో దీపికా పదుకొనే అండ్ దిశా పటాని హీరోయిన్స్ గా నటించారు. ఇక కల్కి చిత్రం జూన్ 27వ తేదీన గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ తరుణంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. ఇక ఈ ఈవెంట్ కు ఈ మూవీలో నటించిన హీరో ప్రభాస్, బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్‌ హాసన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే అండ్ నిర్మాత అశ్విని దట్ హాజరయ్యారు.

దీపిక ప్రెసెంట్ గర్భిణీగా ఉన్నప్పటికీ ఈ ఈవెంట్ కు హాజరైంది. ఇక ఈవెంట్లో దర్శకుడు నాగ్ అశ్విన్ అండ్ హీరోయిన్ దిశా పటాని కనిపించలేదు. ఇక ఈ ఈవెంట్ కి దగ్గుపాటి రానా హోస్ట్ గా వ్యవహరించారు. ఈ క్రమంలోనే రానా అమితాబచ్చన్ గురించి మీ ఒపీనియన్ ఏంటని ప్రభాస్ ని ప్రశ్నించాడు. దీంతో ప్రభాస్.. అమితా బచ్చన్ కు పెద్ద అభిమానిని.. నేను తొలిసారి కలిసినప్పుడు అమితాబచ్చన్ కాళ్లకు నమస్కరించాను. అయితే అలా చేయొద్దని అమితాబ్ చెప్పారు.

Deepika Padukone Kalki pre-release event
Deepika Padukone Kalki pre-release event

ఇంకోసారి అలా చేస్తే నేను కూడా అలా చేస్తానని ఆయన అన్నారు ” అంటూ వెల్లడించాడు ప్రభాస్. ఇక అనంతరం దీపికా పదుకొనే గురించి మాట్లాడకుండానే మైక్ పక్కన పెట్టేందుకు చూశాడు ప్రభాస్. ఈ క్రమంలోనే రానా దీపిక పదుకొనే గురించి మాట్లాడలేదు అంటూ గుర్తు చేశాడు. ఇక ఆ వెంటనే సారీ అంటూ ప్రభాస్ మైక్ తీసుకునే లోగా.. దీపికా పదుకొనే.. ప్రభాస్ ఇంత మాట్లాడడమే ఎక్కువ.. ఇంకా నా గురించి ఏం మాట్లాడతాడు.. తనకి కొంచెం మొహమాటం.. అంటూ వెల్లడించింది. ప్రజెంట్ ఈ కన్వర్జేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు