Deepika Padukone: అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న దీపికా పదుకునే..!

Deepika Padukone..ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలలో పనిచేయడానికి ప్రపంచ సినీ సెలబ్రిటీలు అందరూ కూడా చాలా ఆత్రుత చూపిస్తున్నారు. అందుకే చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా టాలీవుడ్ లో నటించడానికి ఒప్పుకుంటున్నారు. అంతేకాదు చాలామంది హీరోయిన్స్ ఎక్కువగా తాము నటించిన టాలీవుడ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ కురిపించాలి.. అవార్డులు అందుకోవాలి.. ప్రశంసలు దక్కించుకోవాలనే స్థాయిలో ఉన్నారు.. ఈ క్రమంలోనే కేవలం తమ నటనకు ప్రాధాన్యత ఇస్తూ పలు చిత్రాలలో నటించి భారీ క్రేజ్ సంపాదించింది హీరోయిన్ దీపికా పదుకొనే. తాజాగా ఇప్పుడు ఒక అరుదైన గౌరవం దక్కించుకుంది..వాటి గురించి చూద్దాం.

అరుదైన గౌరవాన్ని అందుకున్న దీపికా పదుకొనే..

Deepika Padukone: Deepika Padukone got a rare honor..!
Deepika Padukone: Deepika Padukone got a rare honor..!

దీపిక పదుకొనే తాజాగా డెడ్ లైన్స్ గ్లోబల్ డిస్ రప్టర్స్ అనే హాలీవుడ్ మ్యాగజైన్ ప్రతి సంవత్సరం కూడా వినోదాత్మక రంగంలో రాణిస్తున్న ప్రముఖుల జాబితాను సైతం విడుదల చేస్తూ ఉంటుంది. అయితే ఈ ఏడాది మాత్రం బాలీవుడ్లో అగ్ర హీరోయిన్ గా పేరుపొందిన దీపికా పదుకొనేకు ఇక్కడ చోటు లభించింది. అయితే ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్న ఏకైక ఇండియన్ నటిగా దీపికా పదుకొనే పేరే నిలిచింది. ఈ సందర్భంగా ఈ విషయం పైన దీపికా పదుకొనే స్పందిస్తూ తన ఆనందాన్ని తెలియజేసింది.

ఈ గౌరవం దక్కడానికి అసలు కారణం అదే..

దీపికా పదుకొనే మాట్లాడుతూ… చాలామంది సెలబ్రిటీలు ఉన్నప్పటికీ కేవలం కొంతమందికి మాత్రమే ఇలాంటి గౌరవం దక్కుతుంది.. తన దృష్టిలో ముఖ్యమైనవి ఏవైనా ఉన్నాయి అంటే అది కేవలం ఒక మంచి వ్యక్తిగా ఎదగడమే అన్నట్లుగా తెలియజేసింది. తను అందరితో కలిసి మెలిసి ఉండడం మంచి వ్యక్తులతో ఎక్కువ సమయాన్ని గడపడం వల్ల.. అలాగే సినిమా షూటింగ్ సమయాలలో అనుభవాలే తనకు ఇలాంటి గౌరవాన్ని తీసుకురావడానికి కారణమయ్యిందంటూ తన అభిప్రాయంగా తెలియజేసింది.

- Advertisement -

ఆ డైరెక్టర్ వల్లే ఈ సక్సెస్ లభించింది..

ఎప్పుడైనా సరే ప్రేక్షకులను మెప్పించేలా ఆశ్చర్యపరిచేలా కథలు ఉంటేనే ప్రేక్షకులు చూస్తారని.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అదే జరుగుతుందని కూడా తెలియజేసింది దీపికా పదుకొనే. మొదటిసారిగా ఓం శాంతి ఓం సినిమాకు ఆడిషన్ కి వెళ్ళినప్పుడు.. తాను ఆడిషన్ ఇవ్వలేదని.. 2007లో ఈ సినిమా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.. అలా మొదటిసారి బాలీవుడ్ తెరకు పరిచయమయ్యానని తెలిపింది.. అయితే డైరెక్టర్ ఫర్హాన్ అత్తర్ మాత్రం తనని ఎటువంటి ఆడిషన్ చేయకుండానే ఎంపిక చేశారని అలా ఎందుకు చేశారు ఇప్పటికీ తనకు ఆశ్చర్యంగానే అనిపిస్తూ ఉంటుందని తెలిపింది. అయితే కేవలం తన పైన ఉండే నమ్మకంతోనే తనకు అవకాశం ఇచ్చారని ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపింది.

హాలీవుడ్ సినిమాలకు ఆడిషన్ ఇచ్చా..

అలా అప్పటినుంచి ఇప్పటివరకు ఎన్నో నేర్చుకున్నానని.. బాలీవుడ్ లోనే కాదు హాలీవుడ్ లో కూడా తనని ఎంతోమంది ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారని తెలిపింది.. పది సంవత్సరాల క్రితమే తాను హాలీవుడ్ సినిమాలకు ఆడిషన్ ఇచ్చానని అక్కడ చాలా కొత్త విధానం ఉంటుంది అని తెలుసుకున్నాను అంటూ తెలిపింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు