Deepika Padukone : సిద్ధి వినాయక సన్నిధిలో దీపికా దంపతులు… డెలివరీకి ముందు గణేష్ బ్లెస్సింగ్స్

Deepika Padukone : మరికొన్ని రోజుల్లో దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ మొదటిసారి తల్లిదండ్రులు కావడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. వారి జీవితంలో ఉత్తేజకరమైన కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్న నేపథ్యంలో ఈ జంట వినాయకుడి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి ఆలయానికి వెళ్లారు. ఈ క్రమలోనే దీపికా, రణవీర్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

వినాయకుడి ఆలయంలో దీపికా దంపతులు

బాలీవుడ్ పవర్ కపుల్, త్వరలో కాబోతున్న తల్లిదండ్రులు రణవీర్ సింగ్, దీపికా పదుకొనే ఈ ఏడాది సెప్టెంబర్ 28న తమ జీవితంలోకి కొత్త అతిత్తిని ఆహ్వానించబోతున్నారు. తన డెలివరీ డేట్ కంటే ముందే ముందే దీపికా తన భర్తతో కలసి ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయంలో సందడి చేశారు. మొదటి బిడ్డ రాకతో వారి జీవితంలో అధ్యాయం మొదలు కాబోతున్న నేపథ్యంలో ఆలయంలో భార్యాభర్తలు ఇద్దరూ ప్రత్యేక పూజలు చేశారు. ముంబైతో పాటు దేశం అంతా శనివారం గణేష్ చతుర్థితో పండుగ మోడ్‌లోకి సెలబ్రేషన్స్ మొదలు పెడతారు. అందుకే ఒకరోజు ముందే ఈ జంట వినాయక చవితిని స్టార్ట్ చేశారు. ఇక ఆలయంలో దీపికా గోల్డెన్ థ్రెడ్ వర్క్‌తో ఉన్న అందమైన ఆకుపచ్చ పట్టు చీరను ధరించింది. అయితే ఆమె తన చీర కొంగుతో బేబీ బంప్‌ను దాచుకుంది. మరోవైపు రణ్‌వీర్ స్టైలిష్ ఆఫ్-వైట్ కుర్తా ధరించాడు. ఇక రణవీర్ తన భార్య చేతిని పట్టుకుని జాగ్రత్తగా ఆలయంలోకి తీసుకెళ్ళాడు. ఈ నేపథ్యంలో అక్కడున్న వారిని ఇద్దరూ మనస్పూర్తిగా పలకరించారు.

Ranveer Singh Protects Pregnant Deepika Padukone During Visit To Mumbai's Siddhivinayak  Temple Ahead Of Due Date (VIDEO)

- Advertisement -

సినిమాలకు బ్రేక్

దీపిక ఇటీవల డైరెక్టర్ నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీలో ప్రభాస్‌తో కలిసి కనిపించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఆమె అజయ్ దేవగన్ రాబోయే చిత్రం సింగం రిటర్న్స్‌లో కనిపించనుంది. ఇందులో రణవీర్ సింగ్ కూడా నటించనున్నారు. ఆయన సింబా పాత్రను తిరిగి పోషించబోతున్నాడు. దీపావళి పండుగ సందర్భంగా సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ హాస్పిటల్ లోనే దీపికా ప్రసవం

ఇదిలా ఉండగా దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ ఈ సంవత్సరం 2018లో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తాము మొదటి బిడ్డకు తల్లిదండ్రులం కాబోతున్నాము అనే గుడ్ న్యూస్ ను ఫస్ట్ టైమ్ అభిమానులతో సోషల్ మీడియా ద్వారా  పంచుకున్నారు. ఇప్పుడు ఈ జంట తమ మొదటి బిడ్డ రాక కోసం కౌంట్ డౌన్ చేస్తున్నారు. వారు సెప్టెంబర్ 28న తమ బిడ్డకు స్వాగతం పలికే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే దీపిక సెప్టెంబర్ 28న సౌత్ బాంబేలోని ఆసుపత్రిలో దీపికా ఫస్ట్ బేబీకి జన్మనిస్తుంది. దీపికా ప్రస్తుతం సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది. ప్రస్తుతం దీపికా, రణవీర్ ల అభిమానులు ఈ స్టార్ కపుల్ బేబీ రాక కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక స్వయంగా తానే తన బిడ్డ బాగోగులు చూసుకుంటానని దీపికా ఇప్పటికే చెప్పేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు