Deepika Padukone: బేబీ బంప్ తో దర్శనమిచ్చిన దీపికా పదుకొనే.. ఫొటోస్ వైరల్..!

Deepika Padukone.. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే.. తాజాగా చాలా రోజుల తర్వాత బేబీ బంప్ తో దర్శనం ఇచ్చింది. నిన్న రాత్రి ఆమె తన కుటుంబంతో కలిసి డిన్నర్ డేట్ కి వెళ్ళగా అందులో డెనిమ్ జాకెట్, వైట్ స్నీకర్స్ కింద బ్లాక్ డ్రెస్ లో కనిపించి అలరించింది.. తనతో పాటు నల్ల బ్యాగు కూడా తీసుకెళ్లింది ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం బేబీ బంప్ తో దర్శనమిచ్చి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఎప్పుడో ఫిబ్రవరి నెలలోనే తాము ఒక బిడ్డని త్వరలోనే ఆహ్వానించబోతున్నాము అంటూ ప్రకటించిన ఈ ముద్దుగుమ్మ .. అప్పటినుంచి పలు రకాల ఫోటోలు షేర్ చేస్తోంది కానీ తన బేబీ బంప్ దాచే ప్రయత్నం చేసింది.. కానీ ఎట్టకేలకు నిన్న రాత్రి బేబీ బంప్ తో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

బేబీ బంప్ తో డిన్నర్ డేట్ కి..

Deepika Padukone: Deepika Padukone with baby bump.. Photos viral..!
Deepika Padukone: Deepika Padukone with baby bump.. Photos viral..!

ఇక అసలు విషయంలోకెళితే రణవీర్ సింగ్ తో తన మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్న దీపికా పదుకొనే.. ముంబైలోని తన కుటుంబంతో కలిసి డిన్నర్ కి బయలుదేరింది. శుక్రవారం రాత్రి LA లోకా మారియా రెస్టారెంట్ నుండి బయటకి వస్తున్నప్పుడు అభిమానులు తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్త ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.. ఇక ఇంస్టాగ్రామ్ లో దీపిక అలాగే తన కుటుంబ సభ్యులకు సంబంధించిన వీడియో ని కూడా షేర్ చేయగా అవి ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.. ఇక అంతే కాదు దీపికాతో పాటు దీపికా తల్లి ఉజ్జల పదుకొనే కూడా వెళ్ళినట్లు తెలుస్తోంది.. ఈమె రోజ్ గోల్డ్ శాటిన్ షర్ట్ ధరించి బ్లాక్ పాంట్ లో కనిపించింది.

దీపిక ఫొటోస్ పై నెటిజన్స్ కామెంట్స్..

ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.. కొత్త మమ్మీ లో అందం పెరిగిపోయింది.. ఆమె తల్లి కాబోతున్న నేపథ్యంలో మరింత ప్రకాశవంతంగా కనిపిస్తోంది అంటూ ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ చేయగా.. మరొక వ్యక్తి రణవీర్ సింగ్ ఎక్కడ ఉన్నాడు? అని అడిగారు.. మరొక కామెంట్ లో రణవీర్ సింగ్ తన గర్భవతి అయిన భార్యతో ఎందుకు లేడు? అని కామెంట్లు చేశారు.. మరొక ఇన్ స్టా వినియోగదారులు ఆమె చాలా అందంగా కనిపిస్తోంది అంటూ వ్యాఖ్యానించారు.. ఇలా రకరకాలుగా అభిమానులు ఎవరికి తోచినట్టు వారు తమ అభిమాన హీరోయిన్ పై కామెంట్లతో ప్రశంసల వర్షం కురిపించారు.

- Advertisement -

దీపికా సినిమాలు..

ఇకపోతే పాన్ ఇండియా చిత్రాలలో నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది దీపికా..ఈ సినిమాలతో తన అద్భుతమైన నటన కనపరిచి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ మద్దుగుమ్మ ఇప్పుడు ప్రభాస్ తో మొదటిసారి తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వస్తున్న కల్కి 2898AD సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్గా ఎంపికయింది. ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా మరోసారి ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధమవుతోంది దీపికా పదుకొనే..ఇక ప్రెగ్నెన్సీలో కూడా కల్కి 2898ADచిత్రం కోసం భారీగా కష్టపడినట్లు తెలుస్తోంది మరి ప్రభాస్తో ఈ ముద్దుగుమ్మ ఎలాంటి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు