Kalki2898AD : మన రాజు గారి ఆతిథ్యానికి హీరోయిన్ కూడా ఫిదా అయిపొయింది!

Kalki2898AD : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా కల్కి2898AD సినిమా ప్రమోషన్ లో ఉన్నాడన్న సంగతి తెలిసిందే. ముందుగా టీజర్, మేకింగ్ వీడియోస్ తో రచ్చ చేసిన చిత్ర యూనిట్, ఈ మధ్యనే భైరవ అంతెం సాంగ్ రిలీజ్ చేసి పాన్ ఇండియా వైడ్ గా అట్టెన్షన్ తీసుకొచ్చారు. ఇక ప్రభాస్ సినిమా కాబట్టి టాలీవుడ్ లో ఎలాంటి ప్రమోషన్లు చేసినా, చేయకపోయినా భారీ ఓపెనింగ్స్ కొల్లగొడతాయి. కానీ ఇతర భాషల్లో సినిమా రిలీజ్ చేస్తే ఓపెనింగ్స్ కోసం మినిమం ప్రమోషన్లు చేయాలి. ముఖ్యంగా బాలీవుడ్ పై ఇప్పుడు తెలుగు సినిమాల డామినేషన్ చాలా ఉంది. అందుకే కల్కి మేకర్స్ ప్రమోషన్లు కూడా అక్కడి నుండే మొదలు పెట్టారు. ఇక తాజాగా మొన్ననే కల్కి లిరికల్ సాంగ్ రిలీజ్ చేయగా, తాజాగా కాసేపటికిందే కల్కి ప్రమోషన్లు ముంబైలో స్టార్ట్ చేసారు. ఈ ప్రమోషన్లు దగ్గుపాటి రానా దగ్గరుండి చేయిస్తుండడం విశేషం. ఇక ఈ ప్రమోషన్లకి చిత్ర యూనిట్ ప్రధాన తారాగణం విచ్చేసారు. ప్రభాస్, దీపికా పదుకొనె తో పాటు, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లు కూడా విచ్చేయడం జరిగింది.

Deepika Padukone likes the food brought by Prabhas on the sets of Kalki 2898AD

ప్రభాస్ ఆతిథ్యానికి ఫిదా అయిన దీపికా!

ఇక ఈ ప్రమోషన్ కాసేపటికిందే మొదలు కాగా, దీపికా పదుకొనె ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఐదు నెలల కడుపుతో ఎంత ఇబ్బందిగా ఉన్నా బేబీ బంప్ తో దీపికా కల్కి ప్రమోషన్లకి రావడం విశేషం. ఇక ఈ ప్రమోషన్లలో దీపికా కి రానా నుండి సరదాగా ఏదో ప్రశ్న తలెత్తితే… మాటల్లో దీపికా ప్రభాస్ వల్లే ఇలా తయారయ్యానని చెప్పుకొచ్చింది. అంటే ప్రభాస్ నాకు తినిపించిన అన్ని రకాల ఫుడ్స్ వల్ల నేను ఇలా ఉన్నాను!- అంటూ దీపికా చెప్పుకొచ్చింది. అలాగే ప్రభాస్ ఇంటి నుండి వచ్చే ఆహారం మాత్రం, ఇంటి ఫుడ్ లా కాదు, ఒక ఫుడ్ క్యాటరింగ్ సర్వీస్ రేంజ్ లా ఉంటుందని ప్రభాస్ పై ప్రశంసలు కురిపించింది. అయితే తన సినిమాలోని హీరోయిన్స్ కి, ఆర్టిస్టులకు ప్రభాస్ చేసే మర్యాదలు ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే. ప్ర‌భాస్ అతిథి మ‌ర్యాద‌ల‌కు ఎవ‌రైన ఫిదా కావ‌ల్సిందే. ప్రభాస్‌ తన ఇంటి నుంచి ఫుడ్ తెప్పిస్తే సెట్ లో అందరికి పండుగే. వెరైటీ వంట‌లతో తన కో ఆర్టిస్టులకు అతిధి మర్యాదలు బాగానే చేస్తాడు డార్లింగ్ ప్రభాస్.

- Advertisement -

రాజు గారి ఆతిథ్యానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!

ఇక ప్రభాస్ ఇలా ఫుడ్ సర్వీస్ ఎన్నో ఏళ్లగా చేస్తూ ఉన్నాడు. తన సినిమాలో ఆర్టిస్టులతో పాటు, షూటింగ్ టెక్నిషియన్స్ కి కూడా సమానంగా చూసుకుంటాడు. ఇక ప్రభాస్ ట్రీట్ ఇచ్చిన ప్రతీసారి ఆ వంటలని ఫొటో తీసి చిత్ర నటీనటులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. గతంలో ‘సాహో’ సినిమా షూటింగ్ టైంలో శ్రద్ధ కపూర్ కి, ‘సలార్’ షూటింగ్ లో శృతిహాసన్ కి, ‘ఆదిపురుష్’ టైం లో కృతిసనన్ కి ఇంటి నుంచి తెప్పించిన స్పెషల్ ఫుడ్ పెట్టడంతో వాళ్ళు ఫిదా అయిపోయారు. అలాగే కల్కి షూటింగ్ టైం లో కూడా దీపికకి కూడా స్పెషల్ ఫుడ్ తెప్పించి వడ్డించాడు ప్రభాస్. ఎప్పటిలాగే ప్రభాస్ దీపికా పదుకొనెకి కూడా త‌న ఇంటి నుంచి రకరకాల వంటలు తెప్పించి స్వయంగా వడ్డించాడు ప్రభాస్. ఇక ప్రభాస్ ఇంట్లో ఈ ఆనవాయితీ కృష్ణంరాజు నుండి వచ్చింది. పెదనాన్న ఆతిథ్యాన్ని సేవగా ప్రభాస్ కంటిన్యూ చేస్తున్నాడు. ఇక కల్కి ప్రమోషన్లతో ఇండియా వైడ్ గా భారీ ఓపెనింగ్స్ పై కన్నేశారు మేకర్స్. జూన్ 27న రిలీజ్ కాబోతున్న సినిమా ఫస్ట్ డే అల్ టైం రికార్డులపై కన్నేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు