Deepika Padukone : అమితాబ్ కు ఘోర అవమానం… ఇంకో స్టార్ అయితే లైఫ్ లో దీపికా ముఖం చూడడు

Deepika Padukone : సినిమా ఇండస్ట్రీలో ఉండే దిగ్గజ నటీనటుల మధ్య వివాదాలు అనేవి సర్వసాధారణం. కానీ కొన్నిసార్లు కొంతమంది చేసే పనుల వల్ల ఇతర స్టార్స్ అవమానంగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. దీపిక పదుకొనే, అమితాబ్ బచ్చన్ విషయంలో కూడా ఓసారి ఇదే జరిగింది. మరి కొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతున్న కల్కి మూవీలో వీళ్ళిద్దరూ కలిసి నటిస్తుండడంతో ఈ వార్త తెరపైకి వచ్చింది. ఇంతకీ వీళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

అమితాబ్ ను అవమానించిన దీపిక

కరెక్ట్ గా దాదాపు 10 ఏళ్ల కిందట దీపిక పదుకొనే, అమితాబ్ బచ్చన్ కలిసి నటించిన పికూ మూవీ రిలీజ్ అయింది. అప్పట్లో ఈ మూవీ ఏకంగా 100 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 2015 మే 8న ఈ మూవీ రిలీజ్ అయింది. తండ్రి కూతుర్ల కథతో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సూపర్ సక్సెస్ అయ్యింది. అయితే ఈ మూవీ సక్సెస్ బాష్ కు దీపికా పదుకొనే ఇండస్ట్రీలో ఉన్న పలువురు స్టార్స్ ను ఆహ్వానించింది ఒక్క అమితాబ్ ను తప్ప. అప్పట్లో ఆమె ఏర్పాటు చేసిన పార్టీకి షారుక్ ఖాన్, అలియా భట్ వంటి ఇతర స్టార్ హీరో హీరోయిన్లు అందరూ హాజరయ్యారు. అయితే ఆమె ఏ మూవీ సక్సెస్ అయ్యిందని పార్టీ ఇస్తుందో ఆ సినిమాలో కీలక పాత్ర పోషించిన అమితాబ్ పార్టీలో లేకపోవడం చర్చకు దారి తీసింది. అప్పట్లో అందరూ అమితాబ్ అస్వస్థతకు గురయ్యాడేమో అందుకే పార్టీకి హాజరు కాలేదేమో అని అనుకున్నారు. కానీ ఈ ఈవెంట్ కు అసలు దీపిక ఆయనను ఆహ్వానించలేదని ఆ తర్వాత తెలిసింది.

Here is the first poster of Deepika Padukone and Amitabh Bachchan starrer “The Intern”

- Advertisement -

పార్టీ అయిపోయాక దీపిక ఈ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఇది నా వైపు నుండి జరిగిన ఒక పెద్ద సాంకేతిక లోపం అంటూ విషయం తన దృష్టికి వచ్చేసరికి చాలా ఆలస్యం జరిగిందని ఒప్పుకుంది. అంతేకాకుండా ఇలా జరిగినందుకు చాలా సిగ్గుపడుతున్నాను. కనీసం ఆయనకి ఫోన్ చేసే ధైర్యం కూడా లేదు. అందుకే రెండు రోజుల క్రితం ఆయనకి మెసేజ్ చేశాను అంటూ అసలు విషయాన్ని వెల్లడించి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఆ తర్వాత ఓ సందర్భంలో అమితాబ్ ను ఈ విషయం గురించి ప్రశ్నించగా ఆయన జరగాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికే జరిగిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చోలేము అంటూ సమాధానాన్ని దాటవేశారు. అమితాబ్ దీపిక చేసిన పని వల్ల హర్ట్ అయ్యాడని అందరికీ అర్థమైంది.

పదేళ్ల తర్వాత కాంబో రిపీట్

ఇక ఈ వివాదం జరిగిన తర్వాత దాదాపు వీళ్ళిద్దరూ ఒకే సినిమాలో కలిసి నటించడానికి పదేళ్లు పట్టింది. 2015లో రిలీజ్ అయిన పీకూ తర్వాత అమితా, దీపిక కలిసి నటిస్తున్న ఫస్ట్ మూవీ కల్తీ 2898 మూవీనే కావడం విశేషం. ఈ నేపథ్యంలోనే అప్పట్లో జరిగిన ఆ ఘటనను గుర్తు చేసుకుంటో అమితాబ్ పెద్ద మనసుతో అన్నీ మర్చిపోయారు. అదే వేరే స్టార్ అయితే ఆమె చేసిన పనికి ముఖం కూడా చూసేవాళ్ళు కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు