Deepika Padukone : కొత్త ఇల్లు కొన్న కల్కి బ్యూటీ.. అమ్మో అన్ని కోట్లా?

Deepika Padukone : బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే (Deepika Padukone ) పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈమె తెలుగులో పెద్దగా సినిమాలు లేకపోయినా సినిమాలు చెయ్యకపోయినా కూడా యాడ్స్ లలో ఎక్కువగా చేసింది. ఇక రీసెంట్ గా ఈ అమ్మడు ప్రభాస్ కల్కి సినిమాతో తెలుగు ఆడియన్స్ ను పలకరించింది. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు కలెక్షన్స్ కూడా భారీగా వసూల్ చేసింది. ఈ మూవీతో తెలుగులోకి ఎంట్రీతోనే బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇక తాజాగా ఈ అమ్మడు కొత్త ఇల్లు కొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ఇంటి ధర గురించి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఆ ఇల్లు ధర ఎంతో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ముంబైలోని రిచ్ ఏరియా అంటే బ్రాంద్రా పేరు ఎక్కువగా వినిపిస్తుంది. బాలీవుడ్ లోని ప్రముఖులు అంతా అక్కడే ఇల్లు కొంటున్నారు. ఇప్పటికే ఎంతోమంది సెలెబ్రేటీలు అక్కడ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు. తెలుగు వాళ్లు కూడా అక్కడ ఇల్లు కొన్నారు. సమంత (Samantha ), మంచు లక్ష్మీ (Manchu Lakshmi) లాంటి వాళ్లు సొంతంగా ఇల్లు కొన్నారు. ఇప్పుడు దీపికా పదుకొనే మరో కొత్త ఇంటిని అక్కడ కొనుగోలు చేసినట్లు వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ముంబైలోని బ్రాంద్రాలోని బ్యాండ్‌స్టాండ్ లో ఉంది. సముద్రానికి అభిముఖంగా ఉన్న క్వాడ్రాప్లెక్స్ అపార్ట్‌మెంట్ ఇది. ఏకంగా 11266 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అపార్ట్‌మెంట్ ఆ బిల్డింగ్ లోని 16 నుంచి 19వ అంతస్తు వరకు ఉండటం విశేషం.

Deepika Padukone who bought an expensive house in Mumbai knows how many houses
Deepika Padukone who bought an expensive house in Mumbai knows how many houses

ఇక మూడేళ్ల క్రితం రణవీర్ సింగ్ (Ranaveer Singh), దీపికా జంట రూ. అలీబాగ్ లోనూ ఈ జంట రూ.22 కోట్లతో ఓ బంగ్లా తీసుకుంది. 2013లో వచ్చిన రామ్‌లీలా మూవీలో తొలిసారి నటించారు. ఆ మూవీ సెట్స్ లోనే వీళ్లు ప్రేమలో పడ్డారు. ఐదేళ్ల పాటు డేటింగ్ చేసిన జంట.. 2018లో పెళ్లి చేసుకుంది. ఇక ఈ ఏడాది మొదట్లోనే దీపిక తన తొలి ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసింది. సెప్టెంబర్ లోనే ఆమె తొలి సంతానానికి వెల్‌కమ్ చెప్పనుంది.. ఈ తర్వాత కొన్నేళ్లు గ్యాప్ తీసుకొని మళ్లీ సినిమాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రణవీర్ సింగ్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు