Deepika Padukone: సరే చాలు.. ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది.. దీపికా పదుకొనే పోస్ట్..!

Deepika Padukone: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉన్న ముద్దుగుమ్మ దీపికా పదుకొనే. వరుస సినిమాలను లైన్లో పెట్టిన ఈ భామ త్వరలోనే తల్లి కాబోతుంది. అటు సినిమాలు చేస్తూనే ఇటు తల్లి కాబోతున్న మధుర క్షణాలను ఆస్వాదిస్తుంది.

అంతేకాకుండా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన బేబీ బంప్ తో ఫొటోస్ షేర్ చేస్తుంది దీపికా పదుకొనే. ఇక ఈ క్రమంలోనే తాజాగా దీపికా పదుకొనే బేబీ బంప్ తో ఫోటోలు షేర్ చేసింది. అంతేకాకుండా..” సరే చాలు.. ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది ” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రజెంట్ ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

కాగా ప్రస్తుతం దీపికా పదుకొనే కల్కి చిత్రంలో బిజీగా ఉంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అమితాబచ్చన్ అండ్ కమల్ హాసన్, దిషా పటాని కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ ని వైజయంతి మూవీస్ నిర్మాత అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు