Deputy CM Pawan Kalyan : పేరు పేరునా పరిశ్రమలో స్నేహితులుకు కృతజ్ఞతలు చెప్తున్నా పవన్ కళ్యాణ్

Deputy CM Pawan Kalyan : ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదలు ఏ స్థాయిలో ముంచుకొస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీవీలోనూ వార్తాపత్రికల్లోనూ ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్న ఎన్నో వీడియోస్ కలచి వేస్తున్నాయి. ఇకపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఎటువంటి విపత్తు సంభవించిన సినిమా ఇండస్ట్రీ తమ వంతు సహాయాన్ని చేయడంలో ఎప్పుడూ ముందుంటుందని చెప్పాలి. గతంలో హుదూద్ తుఫాను వచ్చినప్పుడు కూడా చాలామంది సెలబ్రిటీస్ అనేక షోలు నిర్వహించి, దాని ద్వారా వచ్చిన మొత్తాన్ని రాష్ట్రానికి అందజేశారు.

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకి అందరూ పెద్ద ఎత్తున విరాళాలు ఇవ్వటం మొదలుపెట్టారు. కేవలం పెద్ద సెలబ్రిటీస్ మాత్రమే కాకుండా రీసెంట్గా ఫేమ్ సాధించుకున్న చాలామంది రెండు తెలుగు రాష్ట్రాలకి సహాయం చేస్తున్నారు. ఇక సూపర్ సార్ మహేష్ బాబు తన వంతుగా కోటి రూపాయలను రెండు తెలుగు రాష్ట్రాలకి విరాళంగా ప్రకటించారు. అలానే పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కూడా రెండు తెలుగు రాష్ట్రానికి కోటి రూపాయలను విరాళంగా ప్రకటించారు. ఇక పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 400 పంచాయతీలకు ఒక్కో లక్ష చొప్పున మొత్తం నాలుగు కోట్లు తన సొంత డబ్బును నేరుగా పంచాయతీ ఖాతాలకు విరాళం అందించి, విపత్తుని ఎదుర్కొనే శక్తిని పంచాయతీలకు కల్పించే దిశగా తొలి అడుగు వేశారు.

- Advertisement -


ఇక తెలుగు రాష్ట్రానికి విరాళాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా సోషల్ మీడియా వేదికగా తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు పవన్ కళ్యాణ్. ట్విట్టర్ వేదికగా డిప్యూటీ సీఎంవో ఆంధ్ర ప్రదేశ్ అనే అకౌంట్ తో ప్రతి ఒక్కరిని మెన్షన్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, సూర్యదేవర చినబాబు, సిద్దు జొన్నలగడ్డ, వరుణ్ తేజ్, సాయి తేజ్, అనన్య వంటి చాలా సెలబ్రిటీల్ని మెన్షన్ చేస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

Pawan Kalyan

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు