Devara: ఎన్టీఆర్ మూవీని భయపెడుతున్న అనిరుధ్.. ఫ్యాన్స్ లో నిరాశ..!

Devara.. టాలీవుడ్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్న చిత్రం దేవర.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తీసుకురాబోతున్నారు. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉండడం గమనార్హం. పాన్ ఇండియా లెవెల్ లోనే ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తొలిసారి టాలీవుడ్ కి పరిచయం అవుతూ ఇందులో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా.. విలన్ గా సైఫ్ అలీఖా నటిస్తూ ఉన్నారు. అలాగే తదితర నటీనటులు కూడా నటిస్తూ ఉన్నారు. అయితే ఈ చిత్రానికి సంగీతాన్ని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతాన్ని అందించడం మరింత ఊపు ను ఇస్తోంది. అయితే ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు అనిరుద్ వల్లే ఈ సినిమా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Devara: Anirudh is scaring NTR's movie.. Fans are disappointed..!
Devara: Anirudh is scaring NTR’s movie.. Fans are disappointed..!

దేవర సినిమాను పక్కన పెడుతున్న అనిరుధ్..

అనిరుధ్ ఈ మధ్యకాలంలో సంగీతం అందించిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నాయి. దేవర సినిమాకి సంబంధించి టైటిల్ సాంగ్ ని కూడా విడుదల చేయగా పరవాలేదు అనిపించుకుంది. ప్రస్తుతం దేవరా సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్లో ఉన్నట్లు సమాచారం. చిత్ర బృందం మొత్తం అనిరుద్ అందించే సంగీతం కోసమే ఎదురు చూస్తున్నారు. కానీ అనురుధ్ మాత్రం ఎక్కువగా తమిళ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకోసమే దేవర సినిమాలోని సాంగ్స్ ని ఆలస్యంగా చేస్తున్నారనే విధంగా టాక్ వినిపిస్తోంది.

ఫ్యాన్స్ ఫైర్..

దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అనిరుధ్ పై ఫైర్ అవుతున్నారు.. తెలుగు సినిమాలు చేసే సమయంలో ఇలాంటి వ్యత్యాసం చూపించవచ్చా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోలీవుడ్ సినిమాలకు కూడా బెస్ట్ మ్యూజిక్ అందించిన అనిరుద్ దేవరా సినిమా విషయంలో తన పాత వైఖరిని చూపిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి జూన్ నెలలోనే దేవరా సినిమా కోసం ట్యూన్ ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు ఎలాంటి కంపోజ్ కు సంబంధించి పనులే మొదలుపెట్టలేదట.. అనిరుద్ ఇచ్చే ట్యూన్ కోసం లిరిక్ రైటర్స్ కూడా చాలామంది వెయిట్ చేస్తున్నట్లు సమాచారం.

- Advertisement -

దేవర సినిమా ఆలస్యం అందుకే..

మొత్తానికి అనిరుద్ ట్యూన్ ఇవ్వకపోవడం వల్లే దేవర సినిమా ఆలస్యం అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే అనిరుద్ మ్యూజిక్ అందించిన ఇండియన్-2 సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మ్యూజిక్ పరంగా కూడా ఫెయిల్యూర్ గానే ఈ సినిమా మిగిలినట్లు తమిళ ప్రేక్షకుల నుంచి అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా తన చేతిలో ప్రస్తుతం నాలుగైదు సినిమాలు ఉండడం చేత దేవర సినిమా కంటే తమిళ సినిమాల వైపే ఎక్కువ మక్కువ చూపుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

దేవర చిత్రానికి తలనొప్పిగా మారిన అనిరుద్..

దేవర చిత్రానికి అనిరుద్ ఇప్పుడు కొత్త తలనొప్పిగా మారుతున్నారని ప్రచారం కూడా తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువగా నడుస్తోంది. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం అయితే ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారుతోంది. మరి ఈ విషయం పైన అటు చిత్ర బృందం కానీ అనిరుద్ గానీ క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు