Devara Ayoodha Pooja Song Leaked : దేవర థర్డ్ సాంగ్ లీక్, ఎలా ఉందంటే.?

Devara Song Leaked: కొరటాల శివ(Koratala Siva) ఎన్టీఆర్(Ntr) కాంబినేషన్లో వస్తున్న సినిమా దేవర. ఈ సినిమా మీద అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 27న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ముందుగా ఈ డేట్ కి సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న ఓ జి సినిమా రిలీజ్ అవుతుంది అని అనౌన్స్ చేశారు. అయితే ఓజి(OG) సినిమాకి సంబంధించి ఇంకా షూటింగ్ పెండింగ్ లో ఉండటం వలన అదే డేట్ కి దేవర సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రెండు పాటలను రిలీజ్ చేశారు. అయితే మొదటి పాట రిలీజ్ అవ్వడానికంటే ముందు యంగ్ ప్రొడ్యూసర్ నాగ వంశీ(Naga vamsi), దేవర(Devara) ఫస్ట్ సింగల్ విన్నాను హుకుం సాంగును మించి ఉండబోతుంది. ఈ సాంగ్ అందరూ మర్చిపోతారు అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే దేవర ఫస్ట్ సింగిల్ విషయంలో మొదటి కొంచెం నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినా కూడా ఆ తర్వాత సాంగ్ విపరీతంగా వాడటం మొదలుపెట్టారు. ఈ సినిమా నుంచి రీసెంట్ గా చుట్టమల్లే అన్న మెలోడీ సాంగ్ ను కూడా విడుదల చేశారు. దీనిని కాపీ ట్యూన్ అని చెబుతూ మొదటి కామెంట్స్ వచ్చినా కూడా ఇప్పటికీ ఆ పాట ఎక్కువ చోట్ల వినిపిస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ లీక్ అయింది.

Devara

- Advertisement -

ఈ సినిమా నుంచి ఆయుధ పూజ(Ayudha Pooja) అనే పాటను త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లు ఇదివరకే ప్రకటించారు. దీనికి సంబంధించిన 27 సెకండ్లు డ్యూరేషన్ ఉన్న ఆడియో ఒకటి వైరల్ గా మారింది. ఆయుధ పూజ సాంగ్ లీక్ అయింది. ఈ లీక్ అయిన సాంగ్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎప్పటిలానే అనిరుద్ అద్భుతమైన ఇన్స్ట్రుమెంట్స్ తో సాంగ్ బ్లాక్ బస్టర్ అయ్యేలా డిజైన్ చేశాడు అని అర్థమవుతుంది. ప్రస్తుతం ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు