Devara : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే అప్డేట్ అవుట్… కానీ ఇలా చీట్ చేస్తారని ఊహించలేదు

Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ దేవర. మూవీ రిలీజ్ కు టైమ్ దగ్గర పడుతుండగా, మేకర్స్ పాటలతో ఎన్టీఆర్ అభిమనులతో పాటు ఈ మూవీ గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ లవర్స్ కోసం పలు సాంగ్స్ ను రిలీజ్ చేసి మ్యూజికల్ ట్రీట్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా దేవర నుంచి మరో అప్డేట్ వచ్చేసింది.

పూనకాలు తెప్పించే అప్డేట్

మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ దేవర 2024 సెప్టెంబర్ 27న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. RRRతో భారీ విజయం అందుకున్న తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ఫస్ట్ మూవీ ఇదే కావడంతో దేశవ్యాప్తంగా దేవరపై హైప్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఈ సినిమాతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేయనుంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. భైరా పాత్రలో సైఫ్ కనిపించనున్నాడు. అలాగే ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ మేకా, షైన్ టామ్ చాకో, మురళీ శర్మ, నరైన్, కలైయరసన్, చైత్ర రాయ్, అభిమన్యు సింగ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ తమ యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ ప్రాజెక్టును సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన మొదటి రెండు సింగిల్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. ఇక ఇప్పుడు మరో కొత్త అప్డేట్ కు సమయం వచ్చేసింది. చెప్పినట్టుగానే ఈరోజు సినిమా నుంచి మరో కొత్త అప్డేట్ ను ఇచ్చారు మేకర్స్. అందులో దావుడి అనే వీడియో సాంగ్ ను సెప్టెంబర్ 4 న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. అలాగే ఈ సాంగ్ ప్రతీ బీట్ లోనూ విజిల్ వర్తి మ్యాడ్ నెస్ ఉంటుందని ప్రామిస్ చేశారు. ఇక దీనికి సంబంధించిన పోస్టర్ కూడా దావుడి మాస్ సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో స్పష్టంగా తెలిపేలా ఉంది. మొత్తానికి ఈ వీడియో సాంగ్ కోసం మరికొన్ని గంటలు వెయిట్ చేయాలంటూ పోస్టర్ ద్వారా క్యూరియాసిటీని పెంచారు.

Image

- Advertisement -

 ఇది చీటింగ్

అప్డేట్ అయితే వచ్చింది గానీ తూచ్ ఇది చీటింగ్ అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఎందుకంటే దేవర కోసం పాటలు, ఒరిజినల్ స్కోర్‌ను కంపోజ్ చేసిన యంగ్ అండ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఇటీవల తన అధికారిక X (గతంలో ట్విట్టర్) హ్యాండిల్‌ లో దీనికి సంబంధించిన అప్డేట్ ను ఇచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. దేవర నుండి నెక్స్ట్ సింగిల్ దావుడి… తారక్ అన్న, జాన్వీకపూర్ ఆన్ ఫైర్ అంటూ తాజా అప్డేట్ గురించి హింట్ ఇచ్చి ఊరించారు. దీంతో పూనకాలు తెప్పించే దావుడి సాంగ్ ను ఈరోజు రిలీజ్ చేస్తారని వెయిట్ చేశారు. కానీ అది జరగలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు