Devara Fear Song : భయపెట్టే సునామీలా అదిరిపోయిన ‘దేవర’ ఫియర్ సాంగ్..!

Devara Fear Song : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రాల్లో “దేవర” ఒకటి. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఏడాదిన్నర కాలంగా తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, టీజర్ ఓ రేంజ్ రెస్పాన్స్ ని తెచ్చుకోగా, దేవర సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని నందమూరి అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఇప్పటికే దసరా కానుకగా రిలీజ్ కి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా నుండి అందరూ ఎదురుచూస్తున్న అప్డేట్. ఫస్ట్ సాంగ్ వారం రోజుల ముందునుండే ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ గా ఫియర్ సాంగ్ పేరుతో ఫస్ట్ లిరికల్ ని రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించడం జరిగింది. ఇక అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండడంతో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇక మొన్న సాంగ్ కి సంబంధించి చిన్న ప్రోమో రాగా, ఆ ప్రోమోకే గూస్బంప్స్ తెప్పించాయి. ఇక తాజాగా ఈరోజు కాసేపటికిందే “ఫియర్ సాంగ్” పేరుతో “దేవర” ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయి యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.

Devara First Fear Song out now

అనిరుధ్ మ్యూజిక్ కి అదిరిపోయిన తారక్ స్క్రీన్ ప్రెజెన్స్..

ఇక కాసేపటికిందే రిలీజ్ అయిన ఫియర్ సాంగ్ లో అనుకున్నట్టే, అభిమానుల అంచనాలను అందుకునేలా గూస్బంప్స్ తెప్పించేలా ఉంది. అనిరుద్ మ్యూజిక్ కి తోడు రామజోగయ్య శాస్త్రి రాసిన అద్భుతమైన లిరిక్స్ ఫ్యాన్స్ కి హైపెక్కిస్తున్నాయి. స్పెషల్ గా అనిరుద్ బీజీఎమ్ కి కొరటాల మార్క్ షాట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక పాటలో లిరిక్స్ విషయానికి వస్తే.. అగ్గంటుకుంది సంద్రం.. భగ్గున మండె ఆకసం.. అంటూ అనిరుద్ షిప్ మీద ఉండి ఎలివేట్ చేస్తూనే దానికి తగ్గట్టు ఎన్టీఆర్ షాట్స్ ని చూపిస్తుంటే ఎక్స్ట్రార్డినరీ గా అనిపిస్తుంది. అలాగే మధ్యలో “అలలే ఎరుపు నీళ్ళై.. ఆ కాళ్ళను కడిగేరా” అంటూ రామ్ జో రాసిన లైన్ కూడా ఫ్యాన్స్ కి బాగా నచ్చుతుంది.  ఇక ఎన్టీఆర్ అభిమానులకి ఈ పాటతో సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో కొరటాల శివ ముందే చెప్పేసాడు. విడుదలైన కాసేపటికే సోషల్ మీడియాలో టాప్ లో ట్రెండ్ అవుతుంది ఫియర్ సాంగ్.

- Advertisement -

బర్త్ డే కి పర్ఫెక్ట్ ట్రీట్..

ఇక ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ గా ఒకరోజు ముందు విడుదల చేసిన ఈ ఫియర్ సాంగ్ ఎన్టీఆర్ కి పర్ఫెక్ట్ ట్రీట్ కాగా, నందమూరి అభిమానులకి ఒకరోజు ముందే అనిరుద్ గిఫ్ట్ ఇచ్చేసాడని చెప్పాలి. ఇక విడుదల చేసిన ఫియర్ సాంగ్ ని తెలుగులో రామజోగయ్య శాస్త్రి రాయగా, అనిరుద్ రవిచందర్ పాడడం జరిగింది. ఇక అనిరుద్ ప్రతి సినిమాలో హీరోకి సంబంధించి ఆ సినిమాలో క్యారెక్టరైజేషన్ ని డిఫరెంట్ గా ప్రెజెంట్ చేస్తాడు. అలాగే ఈ పాటలో కూడా తారక్ దేవర పాత్రని ఓ రేంజ్ లో ఎలివేట్ చేసాడు. ఎన్టీఆర్ అభిమానులకి బాగా నచ్చిందని చెప్పాలి. ఇక దేవర సాంగ్ ఓవరాల్ గా సోషల్ మీడియాలో పలు రికార్డులని బ్రేక్ చేస్తుందని నందమూరి అభిమానులు అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు