Devara Glimpse: దేవర గ్లింప్స్.. భైర పాత్ర అదుర్స్..!

Devara Glimpse.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా తెరకెక్కుతున్న చిత్రం దేవర. భారీ అంచనాల మధ్య ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన విడుదల కామతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ , గ్లింప్స్ అన్నీ కూడా సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి మరో గ్లింప్స్ విడుదలయ్యింది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో భైర అనే పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నట్లు గతంలో చిత్ర బృందం ప్రకటించగా, తాజాగా ఈరోజు సైఫ్ అలీ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా దేవరా సినిమా నుంచి భైర గ్లింప్స్ విడుదల చేశారు చిత్ర బృందం. ఈ గ్లింప్ చాలా అద్భుతంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా భైర క్యారెక్టర్ లో సైఫ్ జీవించేస్తున్నారు అని చెప్పడంలో సందేహం లేదు.

Devara Glimpse: Devara Glimpses.. Bhaira Patra Adurs..!
Devara Glimpse: Devara Glimpses.. Bhaira Patra Adurs..!

సైఫ్ అలీ ఖాన్ కెరియర్..

సైఫ్ అలీ ఖాన్ సినీ జీవిత విషయానికి వస్తే.. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన అంతకుమించి స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్నారు అని చెప్పవచ్చు ఇక 1991లో ప్రముఖ హిందీ నటి అమృతా సింగ్ ను వివాహం చేసుకున్న తర్వాత ఇద్దరు సంతానం జన్మించారు. అయితే 2004లో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు. ఆ తర్వాత 2012లో ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ను వివాహం చేసుకున్నారు సైఫ్ అలీ ఖాన్..

నవాబుల సామ్రాజ్యానికి అధిపతి..

సైఫ్ అలీ ఖాన్ ఎవరో కాదు భారత జట్టు మాజీ నాయకుడు మన్సూర్ అలీ ఖాన్ పఠౌడి, ప్రముఖ హిందీ నటి షర్మిలా ఠాగూర్ల కుమారుడు. ఇక సైఫ్ అలీ ఖాన్ కూడా మంచి క్రికెట్ క్రీడాకారుడు అన్న విషయం బహుశా చాలామందికి తెలియదని చెప్పాలి. అంతేకాదు ఈయన నిర్మాత కూడా.. ఈయన పూర్వీకులు నవాబులు.సైఫ్ ముత్తాత ఇఫ్తీకార్ అలీ ఖాన్ అలాగే ఈయన తండ్రి మంచూర్ అలీఖాన్ నవాబులుగా ప్రకటించబడ్డారు. ఈయన తండ్రి మరణం తర్వాత ఈయనను పటౌడీ కి 10 వ నవాబుగా ప్రకటించారు.

- Advertisement -

రూ.5 వేల కోట్ల వారసత్వం.. కానీ ఫలితం సున్నా..

ఇక ఈయనకు సుమారుగా రూ.5000 కోట్ల విలువైన పూర్వికుల ఆస్తి లభించింది హర్యానాలోని పటౌడీ ప్యాలెస్ తో పాటు భోపాల్ లో కూడా చాలా విలువైన ఆస్తి ఉంది ఇక ఈయన సొంత పిల్లలు సారా అలీ ఖాన్ కొడుకులు ఇబ్రహీం అలీ ఖాన్, తైమూర్ అలీ ఖాన్ , జెహ్ అలీ ఖాన్ కి తన ఆస్తిలో ఒక్క పైసా కూడా ఇవ్వలేకపోవడం గమనార్హం. ఎందుకంటే సైఫ్ విలాసవంతమైన ఇల్లు పటౌడీ ప్యాలెస్ 1968 డిస్ప్యూట్ ఆక్ట్ కింద వస్తుంది. కాబట్టి ఆ ఆస్తిపై అతడి హక్కులను ఎవరు క్లైమ్ చేయలేరు ఈ చట్ట ప్రకారం 1965, 1971 యుద్ధాల తర్వాత పాకిస్తాన్ కు వలస వెళ్లి అక్కడ పౌరసత్వం తీసుకున్న వారి స్థిరాస్తులు అన్నీ కూడా శత్రువివాదాస్తులుగా ప్రకటించబడ్డాయి..అందుకే ఈ ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికి ఇప్పుడు ఎవరైనా హైకోర్టు , సుప్రీంకోర్టు లేదా భారత రాష్ట్రపతి వరకు వెళ్లవచ్చు. ఇక ఈ యాక్ట్ ఉన్నప్పటికీ దానిపై ఏదైనా చర్య తీసుకోవడం చాలా కష్టంగా మారింది. ముఖ్యంగా వీరి మత ఆచారం ప్రకారం వీరి ఇస్లామతంలో వీలునామ చేయడం అనుమతించదు. అందుకే తమ వారసులకు 25% ఆస్తిని పంచి మిగతాది ఇతరులకు పంచాలని నియమాలు ఉన్నాయి. అందుకే వీరు వేల కోట్ల ఆస్తులకు అధిపతి అయిన వీరికి ఆస్తులు రాకపోవడం గమనార్హం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు