Devara: జాన్వీ పాప పాటకు బాగా కనెక్ట్ అయింది, సోషల్ మీడియాలో కూడా వదలట్లేదు

Devara: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న సినిమా దేవర. ఆచార్య వంటి డిజాస్టర్ సినిమా తర్వాత కొరటాల శివ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. త్రిబుల్ ఆర్ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఈ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగు స్టేట్స్ లో ఈ సినిమాను నాగ వంశీ డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు.

ఇకపోతే ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. అనిరుద్ గురించి అందరికీ తెలిసిందే తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాను తీసుకెళ్లి ఎక్కడో పెడుతుంటాడు. అయితే ఈ సినిమా ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవ్వడానికంటే ముందు నిర్మాత నాగ వంశీ ఈ సినిమా ఫస్ట్ సాంగ్ విన్నాను సాంగ్ కంటే కూడా బాగుంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ మాట చాలామంది ఫ్యాన్స్ కి జోష్ నింపింది. అయితే పాట నచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే నచ్చని వాళ్ళు మాత్రం నాగ వంశీ ను అప్పట్లో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అయితే మొదటి ఈ పాటకు విపరీతమైన ట్రోలింగ్ వచ్చింది. ఈ సాంగ్ నుంచి కాపీ చేసాడు అంటూ ఒరిజినల్ సాంగ్స్ ని కూడా సోషల్ మీడియాలో కొంత మంది పోస్ట్ చేశారు. ఏదేమైనా ప్రస్తుతానికి ఈ పాట మాత్రం స్లోగా ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఈ పాటకు దాదాపు 50 మిలియన్లు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక ఈ పాటను ఇంస్టాగ్రామ్ లో రియల్ గా చేసి జాహ్నవి కపూర్ పోస్ట్ చేసింది. అంటే ఈ పాట జాన్వికి ఎంతగా కనెక్ట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

- Advertisement -

Devara

ఇక ఈ పాట విషయానికి వస్తే పాట ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి చేశారు అనే విషయం పక్కన పెడితే ఈ పాటలో విజువల్స్ మాత్రం విపరీతంగా ఆకట్టుకుంటుంది. జాన్వి కపూర్ బ్యూటీ తో పాటు ఎన్టీఆర్ స్మార్ట్ లుక్స్ కూడా ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ లా అనిపించాయి. ఇకపోతే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడం అనేది కొరటాల శివకు చాలా ఇంపార్టెంట్. మనిషిగా నాలుగు హిట్ సినిమాలు చూసిన తర్వాత ఒక డిజాస్టర్ సినిమా చేయడంతో శివ చాలా ట్రోలింగ్ కు గురి అయ్యాడు. అందరికీ సమాధానం చెప్పాలి అని చాలామంది ఊహిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు