Devara: ఎన్టీఆర్ కోసం లిరిసిస్ట్ గా మారిన డైరెక్టర్

Devara: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తారీకు ఎక్కుతున్న క్రేజీ ప్రాజెక్టులో దేవర సినిమా ఒకటి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే కొరటాల శివకు ఈ సినిమా సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మిర్చి సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన కొరటాల శివ వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ సినిమాలు చేశాడు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశాన్ని పొందుకున్నాడు. అయితే మెగాస్టార్ చిరంజీవితో చేసిన ఆచార్య సినిమా డిజాస్టర్ అయింది. అక్కడితో కొరటాల శివ ఇమేజ్ అంతా పడిపోయింది. సినిమా ఫెయిల్యూర్ కి తనే బాధ్యుడు అయిపోయాడు.

ఇప్పుడు కొరటాల తనను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈసారి పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ కొట్టాలని ప్లాన్ చేశాడు కొరటాల. అయితే ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్ అలానే సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇకపోతే ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేయబోతున్నట్లు కొద్దిసేపటి క్రితమే అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. అయితే ఈ సెకండ్ సింగిల్ కోసం తమిళ్లో ఒక డైరెక్టర్ లిరిక్ గా మారాడు. అతను మరెవరో కాదు నయనతార భర్త విగ్నేష్ శివన్. ఈ పాటకి సంబంధించిన తమిళ్ లిరిక్స్ విగ్నేష్ అందిస్తున్నాడు.

 Nenu Rowdy Ne

- Advertisement -

అసిస్టెంట్ డైరెక్టర్గా కొన్నేళ్లు పనిచేసిన విగ్నేష్ నేను రౌడీనే అనే సినిమాతో దర్శకుడుగా మారాడు. అక్కడితో నయనతారకు పరిచయమై ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసి నేడు పెళ్లి వరకు వెళ్లారు. ప్రస్తుతం వీరిద్దరికి ఇద్దరు కిడ్స్ కూడా ఉన్నారు. ఆ సినిమా తర్వాత కూడా విగ్నేష్ చాలా సినిమాలు చేశాడు. విగ్నేష్ కి ఉన్న టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు డైరెక్షన్ తో పాటు మ్యూజిక్ మీద కూడా మంచి అవగాహన విగ్నేష్ కి ఉంది. బ్యాండ్ కూడా బాగా వాయిస్తాడు. అయితే ఇప్పుడు విగ్నేష్ తనలోని లేడీస్ కూడా దేవర సినిమా కోసం మరోసారి బయటకు తీశాడు. ఇదివరకే చాలామంది నటులు దర్శకులు చాలా పాటలు రాశారు. అందులో ధనుష్, శివ కార్తికేయన్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు