Devara : అక్కడ దేవర జాతర ఖాయం.. ఈ స్పీడు చూస్తుంటేనే తెలుస్తుంది..!

Devara : జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ “దేవర” రిలీజ్ డేట్ దగ్గరవుతున్న కొద్దీ అంచనాలు విపరీతంగా పెంచేస్తుంది. నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్, సినిమాపై అంచనాలని స్కై లెవెల్లో పెంచేసాయి. మధ్యలో పాటలు కాస్త ట్రోల్ అయినా, వింటున్న కొద్దీ చార్ట్ బస్టర్స్ గా నిలుస్తున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా మొత్తం పూర్తయిందని ఆ మధ్య ఎన్టీఆర్ ట్వీట్ కూడా చేసాడు. అయితే సినిమా ప్రమోషన్ల జోరు పెంచట్లేదని అభిమానులు కాస్త నిరాశలో ఉండగా, అతి త్వరలోనే మూడో సాంగ్ రిలీజ్ అవుతుందని రచయిత రామజోగయ్య శాస్త్రి (Rama Jogayyasastry) చెప్పుకొచ్చాడు.

Devara movie crossed 100k mark in overseas

అప్పుడే ఇక్కడ బుకింగ్స్ స్టార్ట్..

ఇదిలా ఉండగా దేవర (Devara) సినిమాకి ఇంకా నాలుగు వారాల సమయం ఉండగా, ఓవర్సీస్ లో అప్పుడే బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇకపోతే ఓవర్సీస్ లో బుకింగ్స్ స్టార్ట్ చేసి రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే 100k డాలర్ల మార్క్ దాటిపోవడం విశేషం. ఈ స్పీడ్ చూస్తుంటే ఓవర్సీస్ లో రికార్డుల జాతర ఖాయమని తెలుస్తుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా రిలీజ్ టైం నాటికి పీక్స్ లో బుకింగ్స్ జరుగుతాయని చెప్పొచ్చు. టాక్ తో సంబంధం లేకుండా దేవర కి ఓపెనింగ్స్ వస్తాయని సినిమా మీద ఉన్న హైప్ ని బట్టి తెలిసిపోతుంది. ఇక ఫస్ట్ డే నే వంద కోట్ల వసూళ్ల టార్గెట్ ని పెట్టుకున్నారు మేకర్స్.

- Advertisement -

ప్రమోషన్లు స్టార్ట్ చేయాల్సిందే..

అయితే చిత్ర యూనిట్ ప్రమోషన్లు మాత్రం ఇంకా స్టార్ట్ చేయకపోవడం సరికాదని ట్రేడ్ విశ్లేషకుల మాట. కానీ ఇతర భాషల్లో ఉన్న సినిమాల పోటీ దృష్ట్యా ఖచ్చితంగా దేవరకి సాలిడ్ ఓపెనింగ్స్ రావాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల సంగతి పక్కనబెడితే, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గట్టి ప్రమోషన్లు కావాల్సి ఉంటుంది. అందుకు మేకర్స్ ఇప్పటినుండే సాంగ్స్ వంటివి రిలీజ్ చేస్తూ, మూడు వారాల ముందునుండే ఇతర భాషల్లో ప్రమోషనల్ టూర్లు వేయాల్సి ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక వినాయకచవితి నాడు మూడో సాంగ్ (Devara third song) రిలీజ్ చేసి అక్కడి నుండి ప్రమోషన్స్ గట్టిగా చేస్తారని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు