Devara : భారీ రికార్డ్ పై కన్నేసిన దేవర మేకర్స్.. ఓవర్సీస్ సహా.. అన్ని చోట్లా ప్లాన్!

Devara : టాలీవుడ్ లో కల్కి2898AD తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”. ఎన్టీఆర్ (Jr NTR) – కొరటాల శివ కాంబినేషన్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ మొదలుకొని, ఇప్పటివరకు వచ్చిన టీజర్, సాంగ్స్ సినిమాపై అంచనాలని స్కై లెవెల్లో పెంచేసాయి. ఇక సమ్మర్ లో రావాల్సిన ఈ సినిమా సెప్టెంబర్ 27కి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరవుతున్న కొద్దీ మేకర్స్ ప్రమోషన్లలో జోరు పెంచే పనిమీదున్నారు. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ చేయగా త్వరలో మూడో సాంగ్ ని కూడా రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా దేవర (Devara) నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

Devara movie makers plan for huge openings

అరుదైన రికార్డ్ సృష్టించనున్న మేకర్స్…

దేవర సినిమా రిలీజ్ కి సరిగ్గా మరో నెలరోజులు మాత్రమే ఉంది. ఇక మేకర్స్ ఇప్పటినుండే భారీ ప్రమోషన్లు చేయడానికి ఫిక్స్ అయ్యారు. ఇదిలా ఉండగా దేవర సినిమాతో కొత్త రికార్డ్స్ సెట్ చేయడానికి మేకర్స్ ఎంతో ప్లాన్ చేస్తున్నారు. వెయ్యి కోట్ల సత్తా ఉన్న సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటని నెట్టింట టాక్ ఉంది. దానికి తగ్గట్టుగానే దేవర సినిమాకి తొలిరోజే అల్ టైం రికార్డులు కొట్టాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక దేవర సినిమా థియేటర్లలో రిలీజ్ రోజు వేకువజామునే, ఆర్లి మార్నింగ్ 1.08 AM షోలు స్టార్ట్ చేయనున్నట్టు సమాచారం. ఇది కేవలం సిటీ ఏరియాల్లో, ఓవర్సీస్ లో మాత్రమే కాదు.. వరల్డ్ వైడ్ గా దేవర ప్రదర్శింప బడే అన్ని థియేటర్లలో ప్లాన్ చేస్తునట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు దేవరకు మంచి టాక్ వస్తే తొలిరోజే 150 నుండి 200 కోట్ల ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -

నెక్స్ట్ సాంగ్ కోసం వెయిటింగ్…

ఇక దేవర నుండి వస్తున్న ప్రతి అప్డేట్ కూడా సినిమాపై అంచనాలను స్కై లెవెల్లో పెంచేస్తుందని చెప్పాలి. ప్రస్తుతం దేవర నుండి రాబోయే మూడో పాటగా “ఆయుధ పూజ” సాంగ్ రాబోతుందని సమాచారం. దీని కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సినిమాలో ఈ సాంగ్ లో దేవర ఎలివేషన్లు పీక్స్ లో ఉంటాయని సమాచారం. ఇక దేవర సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తుండగా, అనిరుద్ (Anirudh) మ్యూజిక్ అందిస్తున్నాడు. జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్న విషయం తెలిసందే. సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలతో పాన్ ఇండియా భాషల్లో దేవర ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవర మూడో సాంగ్ ని సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోనే రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు