Devara Second Song : ఏంటి భయ్యా ఈ అరాచకం… సాంగ్ చూస్తే నిజంగానే చూపులు తిప్పుకోలేం..

Devara Second Song :  టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ చిత్రాల్లో ‘దేవర’ ఒకటి. కల్కి తర్వాత నెక్స్ట్ రాబోతున్న భారీ పాన్ ఇండియా సినిమా దేవరనే కావడంతో మూవీ లవర్స్ అందరి చూపు దీనిపైనే ఉంది. ఇక షూటింగ్ డిలే వల్ల దేవర సమ్మర్ నుండి సెప్టెంబర్ కి వాయిదా పడిందని తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబోలో జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక దేవర నుండి ఇదివరకు “ఫియర్ సాంగ్” విడుదల కాగా ఆ సాంగ్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక తాజాగా దేవర నుండి రెండో సాంగ్ (Devara Second Song) ఎప్పుడెప్పుడా అంటూ ఫ్యాన్స్ ఎదురుచూసారు. కాగా ఎట్టకేలకు రెండో పాటని కాసేపటికిందే రిలీజ్ చేసారు మేకర్స్.

Devara movie Second Song Out now

చుట్టమల్లే చుట్టేస్తాంది..

ఇక దేవర నుండి రెండో పాట చుట్టమల్లే చుట్టేస్తాంది పేరుతో రిలీజ్ కాగా యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. చాలా మంది అన్నారు ఇది రొమాంటిక్ సాంగ్ గానే రిలీజ్ చేయగా, దేవర తంగం మధ్య రొమాంటిక్ డాన్స్ మూమెంట్స్ తో బీచ్ లో డిజైన్ చేసారు సాంగ్. ఇక సాంగ్ చూస్తున్నంత సేపు చూపు తిప్పుకోనివ్వడం లేదనాలి. విజువల్స్ పరంగా డీసెంట్ గా ఉండగా మ్యూజిక్ బాగుంది. ఫ్రెష్ ట్యూన్స్ లా అనిపించకపోయినా, వినగా వినగా సాంగ్ ఎక్కేస్తుందనేలా ఉంది. ముఖ్యంగా సాంగ్ కి తగ్గట్టు బ్యూటిఫుల్ విజువల్స్ తో మేకర్స్ అందంగా షూట్ చేసారని చెప్పాలి. ఇక ఈ సాంగ్ ని రామజోగయ్య శాస్త్రి రాయగా, శిల్పా రావు సాంగ్ ని అద్భుతంగా పాడింది. ఇక పాటకు బాస్కో మార్టిస్ కొరియోగ్ర‌ఫీ బాగుంది.

- Advertisement -

దేవర ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్..

ఇక దేవర నుండి ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్స్ టీజర్ తో పాటు విడుదలైన రెండు పాటలు కూడా ఆకట్టుకుని సినిమాపై అంచనాలు పెంచేసాయి. రెండో సాంగ్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ రొమాంటిక్ మూమెంట్ లో తెరకెక్కించగా, మెలోడీ రొమాంటిక్ ట్యూన్స్ లో వన్ అఫ్ ది బెస్ట్ సాంగ్ గా నిలిచే సాంగ్ అవుతుందని ఎన్టీఆర్ ఫాన్స్ అంటున్నారు. ఇక సాంగ్ పోస్టర్ వచ్చినపుడు కాస్త ట్రోలింగ్ అయినా, ఇప్పుడు బాగా ఆకట్టుకుంటుందని నెటిజన్లు అంటున్నారు. ఇక దేవరని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తుండగా, అనిరుద్ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు