Devara : తెలుగు రాష్ట్రాల్లో ‘దేవర’ హక్కుల్ని దక్కించుకున్న వారు వీళ్ళే!

Devara : నందమూరి అభిమానులు “దేవర” రిలీజ్ డేట్ దగ్గరవుతున్న కొద్దీ ఎప్పుడెప్పుడా అంటూ క్యూరియాసిటీ పెరిగిపోతుంది. RRR తర్వాత ఎన్టీఆర్ కెరీర్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రమిది. అలాగే పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలున్న సినిమాల్లో దేవర గురించే ముందుగా చెప్పుకోవాలి. ఇక ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పుడు సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. నిజానికి దేవర సినిమా అక్టోబర్ 10న రిలీజ్ కావాల్సి ఉండగా, సెప్టెంబర్లో రావాల్సిన ‘ఓజి’ సినిమా వాయిదా పడడంతో, ఆ డేట్ కి దేవరాని షిఫ్ట్ చేస్తూ సెప్టెంబర్ 27కి ప్రీ పోన్ చేసారు. దీంతో రెండు వారాలు సినిమా ముందుకు జరిగే సరికి అభిమానులు సంతోషిస్తున్నారు. పైగా దేవర సినిమా రిలీజ్ డేట్ రెండు వారాలు ముందుకు వచ్చే సరికి దేవర సినిమా బిజినెస్ లో కూడా చాలా మార్పులు వచ్చేసాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో దేవర (Devara) ని పలు ఏరియాల్లో భారీ రేటుకు కొనుగోలు చేసారు.

Devara movie Telugu States distributors list

దేవర హక్కులు సొంతం సొంతం చేసుకున్న డిస్ట్రిబ్యూషన్స్ సంస్థలు…

ఎన్టీఆర్ నటిస్తున్న దేవర చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో భారీ రేటుకి డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేసారు. ఇక రిలీజ్ కి మూడు నెలల ముందే డిస్ట్రిబ్యూటర్లు ఫిక్స్ అయ్యారు. ఒకవేళ దేవర రేటు రిలీజ్ టైం కల్లా కాస్త మారినా దేవర డిస్ట్రిబ్యూటర్లు మాత్రం మారరని సమాచారం. ఇక దేవర ని ఏరియా వారీగా సొంతం చేసుకున్న డిస్ట్రిబ్యూటర్ల సంస్థల వివరాలు ఈ విధంగా ఉన్నాయి…
నైజాం – దిల్ రాజు
వైజాగ్ – పూర్వి పిక్చర్స్
వెస్ట్ – LVR ఆదిత్య ఫిలిమ్స్
ఈస్ట్ – విజయలక్ష్మి సినిమాస్
గుంటూరు – రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్
నెల్లూరు – భాస్కర్ రెడ్డి
కృష్ణ – ధీరజ్ ఎంటర్టైన్మెంట్స్
సీడెడ్ – ఈచ్ డిస్టిక్ డిఫరెంట్ పార్టీ

- Advertisement -

ఇక తెలుగు రాష్ట్రాల హక్కులని నిర్మాత నాగ వంశీ ఆధ్వర్యంలో ఏరియాల వారీగా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది.

థాయిలాండ్ లో దేవర షూట్…

ఇక దేవర సినిమా షూటింగ్ ఇటీవల గోవాలో జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా దేవర షెడ్యూల్ థాయిలాండ్ లో జరుగనుంది. అక్కడ వారం రోజుల పాటు ఒక యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయనున్నట్టు సమాచారం. అయితే నిజానికి దేవర తర్వాతి షెడ్యూల్ కూడా గోవాలోని జరగాల్సింది. కానీ అక్కడ గత కొన్ని రోజులుగా పడుతున్న వర్షాల వల్ల సినిమా షూట్ చేయడానికి అనుకూలంగా వాతావరణం లేకపోవడం వల్ల ఆ షెడ్యూల్ ని థాయిలాండ్ కి షిఫ్ట్ చేసారు. ఇక ఎన్టీఆర్ తన ఫ్యామిలీ తో సహా వెకేషన్ కి ప్లాన్ చేస్తూ థాయిలాండ్ కి వెళ్లడం జరిగింది. ఇక దేవర చిత్రానికి సంబంధించి షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తయిపోగా, మిగతా పార్ట్ ని కూడా ఎంత వీలైతే అంత తొందరగా పూర్తి చేసి ప్రమోషన్లపై దృష్టి పెట్టాలని చూస్తున్నారు. ఇక ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా భాషల్లో దేవర సినిమాని రిలీజ్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు