Devara : దేవర మేకర్స్ సాలిడ్ అప్డేట్.. బిగ్ బ్లాస్ట్ కి రెడీ అయిపోండి..

Devara : టాలీవుడ్ లో కల్కి2898AD తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”. ఎన్టీఆర్ (Jr NTR) – కొరటాల శివ కాంబినేషన్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ మొదలుకొని, ఇప్పటివరకు వచ్చిన టీజర్, సాంగ్స్ సినిమాపై అంచనాలని స్కై లెవెల్లో పెంచేసాయి. మధ్యలో పాటలు కాస్త ట్రోల్ అయినా, వింటున్న కొద్దీ చార్ట్ బస్టర్స్ గా నిలుస్తున్నాయి. ఇక సమ్మర్ లో రావాల్సిన ఈ సినిమా సెప్టెంబర్ 27కి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరవుతున్న కొద్దీ మేకర్స్ ప్రమోషన్లలో జోరు పెంచే పనిమీదున్నారు. ఇదిలా ఉండగా తాజాగా దేవర (Devara) నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

Devara Movie Third Single Update

దేవర నుండి మేకర్స్ సాలిడ్ అప్డేట్…

దేవర సినిమా నుండి ఇప్పటివరకు రెండు పాటలు రిలీజ్ కాగా, రెండూ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఫియర్ సాంగ్ మాంచి మాస్ ట్యూన్స్ తో ఫ్యాన్స్ కి గూస్బంప్స్ తెప్పిస్తుండగా, రెండో సాంగ్ రొమాంటిక్ ట్యూన్ గా మూవీ లవర్స్ ని అలరిస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా దేవర నుండి మూడో సాంగ్ గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాకు రచయిత రామజోగయ్య శాస్త్రి (Rama Jogaiah sastri) పాటలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆయన బర్త్ డే సందర్బంగా మేకర్స్ తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఈ సందర్బంగా దేవర నుండి నెక్స్ట్ వచ్చే సాంగ్ “బిగ్ బ్లాస్ట్” గా నిలుస్తుందని, అలాంటి పాటను శాస్త్రి అందించారని… వినడానికి సిద్ధం అవండి అంటూ మేకర్స్ సాలిడ్ అప్డేట్ అందించారు.

- Advertisement -

 

అమాంతం అంచనాలను పెంచేస్తున్న దేవర..

ఇక దేవర నుండి వస్తున్న ప్రతి అప్డేట్ కూడా సినిమాపై అంచనాలను స్కై లెవెల్లో పెంచేస్తుందని చెప్పాలి. ఇక దేవర నుండి రాబోయే మూడో పాటగా “ఆయుధ పూజ” సాంగ్ రాబోతుందని సమాచారం. దీని కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక దేవరను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తుండగా, అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్న విషయం తెలిసందే. సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలతో పాన్ ఇండియా భాషల్లో దేవర ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు