Devara : డే వన్ కే సెంచరీ కొట్టాలంటే ఇదొక్కటే బ్రహ్మాస్త్రం?

Devara : జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ (Koratala Shiva) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ “దేవర” రిలీజ్ డేట్ దగ్గరవుతున్న కొద్దీ అంచనాలు విపరీతంగా పెంచేస్తుంది. నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్ సినిమాపై అంచనాలని స్కై లెవెల్లో పెంచేయగా, విడుదలైన మూడు పాటలు కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. పాటలు వచ్చినపుడు కాస్త ట్రోల్ అయినా, వింటున్న కొద్దీ చార్ట్ బస్టర్స్ గా నిలుస్తున్నాయి. ఇక దేవర షూటింగ్ కూడా మొత్తం పూర్తయిపోగా, చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్లలో వేగం పెంచింది. ఇదిలా ఉండగా దేవర సినిమాకి సంబంధించి ఓవర్సీస్ లో వారం కిందటే బుకింగ్స్ మొదలవగా, రిలీజ్ కి ఇంకా మూడు వారాలు ఉండగానే ఏకంగా 600k డాలర్లు బుకింగ్స్ తోనే క్రాస్ చేసేయడం విశేషం.

Devara Movie Trailer Update

డే వన్ నుండే రికార్డులపై గురి..?

ఇదిలా ఉండగా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న దేవర (Devara) పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. RRR తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా కాబట్టి ఇతర భాషల్లో కూడా భారీ హైప్ ఉంది. కానీ దేవర సినిమా ప్రమోషన్లలో జాప్యం వల్ల ఓపెనింగ్స్ సాలిడ్ గా వస్తాయా అంటే చెప్పలేం. తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్లు చేసినా చేయకపోయినా తారక్ (Jr NTR) సినిమా కాబట్టి సెన్సేషనల్ ఓపెనింగ్స్ గ్యారెంటీ. కానీ ఇతర భాషల్లో మంచి ఓపెనింగ్స్ కావాలంటే చిత్ర యూనిట్ ఇప్పటినుండే ప్రమోషనల్ టూర్లు వేస్తూ ఉండాలి. ఇక ప్రస్తుతం దేవర హైప్ ని బట్టి 90 నుండి 100 కోట్ల ఓపెనింగ్స్ కి ఛాన్స్ ఉంది. కానీ 100 నుండి 150 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ రావాలంటే దేవరకి సాలిడ్ క్రేజ్ రావాలి.

- Advertisement -

సినిమా రేంజ్ ని డిసైడ్ చేసే అస్త్రం ఇదొక్కటే?

అయితే దేవర సినిమాకి ఉన్న మూడు వారాల్లో ఇండియా వైడ్ గా భారీ ప్రమోషన్లు అంటే చిత్ర యూనిట్ బాగా శ్రమించాల్సి ఉంటుంది. కానీ దేవర కి వాటితో పని లేకుండా హైప్ రావాలంటే అది “దేవర థియేట్రికల్ ట్రైలర్” (Devara Trailer) వల్లే సాధ్యం. టీజర్ వల్ల దేవరకి మంచి హైప్ రాగా, ట్రైలర్ తో దానికి మించిన డబుల్ హైప్ రావాల్సి ఉంటుంది. ట్రైలర్ ని ఎంత ఫ్రెష్ గా, ప్రేక్షకులకి నచ్చేలా చూపిస్తే, అంత హైప్ తీసుకురావచ్చు. గతంలో సలార్ (Salaar), కల్కి2898AD లాంటి సినిమాలకి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా లేకుండా, కేవలం ట్రైలర్ తోనే ఓ రేంజ్ హైప్ తీసుకొచ్చారు మేకర్స్. ఇప్పుడు దేవర కూడా పాన్ ఇండియా రేంజ్ లో భారీ క్రేజ్ తెచ్చుకోవాలంటే ఒక్క ట్రైలర్ తోనే ఆడియన్స్ ని ఓ రేంజ్ లో అట్రాక్ట్ చేయాలి. ఇక దేవర ట్రైలర్ ని సెప్టెంబర్ 10న రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. ఇక వెయ్యి కోట్ల సత్తా ఉన్న సినిమాల్లో దేవర కూడా ఒకటి కాగా, ఆ ఫీట్ సాధించాలంటే దేవర డే వన్ కే 150 కోట్ల మార్క్ ఓపెనింగ్స్ సాధించాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు