Jr NTR’s Devara : కొరటాలను సెట్ చేయనున్న ఎన్టీఆర్

Jr NTR’s Devara : తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. నిన్ను చూడాలని సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో అద్భుతమైన హిట్ సినిమాను అందుకున్నాడు ఎన్టీఆర్. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. తాతకు తగ్గ మనవడు అంటూ చాలా ప్రశంసలు అందుకున్నాడు ఆ సినిమాతో. ఆ సినిమా తర్వాత చేసిన సుబ్బు సినిమా ఊహించని విజయాన్ని అందుకోలేదు. మళ్లీ వివి వినాయక దర్శకత్వంలో చేసిన ఆది సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది అక్కడితోనే ఒక స్టార్ హీరోగా ఎదిగిపోయాడు ఎన్టీఆర్. ఇక్కడి నుంచి ఎన్టీఆర్ కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ అనేది క్రియేట్ అయింది.

మళ్లీ కొన్ని డిజాస్టర్ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ సినిమా తర్వాత వరుసగా డిజాస్టర్ సినిమాలో ఎన్టీఆర్ కెరియర్ లో పడ్డాయి. మళ్లీ యమదొంగ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత మళ్లీ డిజాస్టర్ సినిమాలు ఎన్టీఆర్ కెరియర్ లో పడ్డాయి. అయితే ఎన్టీఆర్ కెరియర్ మొత్తంలో హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. ప్లాప్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఒక టైం లో ఎన్టీఆర్ కేవలం సక్సెస్ఫుల్ డైరెక్టర్లు వెనకాల మాత్రమే తిరిగేవాడు. ఒక డైరెక్టర్ ఒక సినిమాతో సక్సెస్ కొట్టగానే ఆ తర్వాత ఆ డైరెక్టర్ తో సినిమాను చేసి ఒక డిజాస్టర్ అందుకునేవాడు.

హిట్స్ డైరెక్టర్స్ వెనుక పడటం

కిక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సురేందర్ రెడ్డి తో సినిమా చేసి ఊసరవెల్లి సినిమాతో ఒక డిజాస్టర్ అందుకున్నాడు. సింహా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బోయపాటి శ్రీను తో సినిమాను చేసి దమ్ముతో డిజాస్టర్ మూట కట్టుకున్నాడు. దూకుడు సినిమాతో హిట్ అందుకున్న శ్రీను వైట్లతో బాద్షా సినిమాను చేసి పరవాలేదు అనిపించుకున్నాడు. అయితే గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హరీష్ శంకర్ తో జతకట్టి రామయ్య వస్తావయ్య సినిమాతో మళ్ళీ డిజాస్టర్ గా అందుకున్నాడు. కందిరీగతో హిట్ అందుకున్న సంతోషం సినిమా చేసి రభస సినిమాకు ప్లాప్ అందుకున్నాడు. ఇలా సక్సెస్ఫుల్ డైరెక్టర్ వెనకాల పెట్టిన ప్రతిసారి కూడా ఒక ప్లాప్ మూట కట్టుకున్నాడు ఎన్టీఆర్.

- Advertisement -

ప్లాప్ డైరెక్టర్స్ ను సెట్ చెయ్యడం

అయితే ఎన్టీఆర్ కెరియర్ టెంపర్ సినిమాకు ముందు టెంపర్ సినిమా తర్వాతనే చెప్పొచ్చు. టెంపర్ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. టెంపర్ సినిమా తర్వాత ఇప్పటివరకు ఎన్టీఆర్ కి డిజాస్టర్ సినిమా అంటూ పడలేదు. ప్లాప్స్ లో ఉన్న ప్రతి డైరెక్టర్ తో సినిమా చేసి మంచి హిట్ అందుకున్నాడు ఎన్టీఆర్. నాన్నకు ప్రేమతో చేసిన సుకుమార్, జై లవకుశ చేసిన బాబి, అరవింద సమేత వీర రాఘవ సినిమా చేసిన త్రివిక్రమ్ వీళ్ళందరూ కూడా వారు చేసిన ముందు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అందుకున్నవాళ్లే.

Devara: NTR to set the bar
Devara: NTR to set the bar

ఇకపోతే ప్రస్తుతం కొరటాల శివతో సినిమాను చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాకు దేవర అనే టైటిల్ను ఫిక్స్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా అద్భుతమైన రెస్పాన్స్ సాధించుకుంది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ని మే 19 వ తారీఖున రిలీజ్ చేయనున్నారు. ఇకపోతే కొరటాల ముందు సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటివరకు కొరటాల శివకు ఉన్న ఇమేజ్ అంతా కూడా ఈ సినిమాతో చెక్కు చెదిరిపోయిందని చెప్పొచ్చు. చాలామంది దర్శకులను ఎన్టీఆర్ సెట్ చేసినట్టు, ఈ సినిమాతో కూడా కొరటాల చేయమని సెట్ చేస్తాడు అనేది చాలా మంది అభిప్రాయం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు