Devara : ఆచార్య సినిమా డిజాస్టర్ పై ఎన్టీఆర్ రియాక్షన్

Devara : ఏ సినిమా ఎప్పుడు ఎలాంటి విజయం సాధిస్తుందో ఎవరూ ఊహించలేరు. బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన కొన్ని సినిమాలు డిజాస్టర్ గా మారిన సందర్భాలు ఉన్నాయి. డైరెక్టర్ తో ఒక హీరో సినిమా చేస్తున్నాడు అంటే ఆ సినిమా మీద అంచనాలు విపరీతంగా ఉంటాయి. అంచనాలను ఏమాత్రం అందుకోలేక పోయినా కూడా ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోతుంది. లేదంటే కనీసం యావరేజ్ సినిమా అనిపించుకుంటుంది. లేకపోతే వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ సినిమాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అందించాడు కొరటాల శివ. నాలుగు బ్లాక్ బస్టర్లు ఇచ్చిన తర్వాత మెగాస్టార్ లాంటి హీరో పిలిచి అవకాశం ఇచ్చాడు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో చేసిన సినిమా ఆచార్య. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. మినిమం కూడా అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోయింది. అప్పటికే కొరటాల శివ కి వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ సినిమాలు ఉండటం. ఆ తర్వాత ఆ సినిమాకి మణిశర్మ(Mani Sharma) మ్యూజిక్ అందించడం. ఇవన్నీ కూడా బాగా కలిసి వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ కథ కరెక్ట్ గా కుదరకపోతే ఏ సినిమా అయినా కూడా ఎవరూ కాపాడలేరు. ఆడియన్స్ కూడా వాళ్ళకి ఏదైనా ఒక పాయింట్ కనెక్ట్ అయితే మాత్రమే చూస్తారు. కథ నచ్చకపోతే అది మెగాస్టార్ సినిమా అయినా మరో సూపర్ స్టార్ సినిమా అయినా ప్రేక్షకులు అంతగా అంగీకరించరు. ఇక ఆశ్చర్య ఫలితం గురించి మనందరికీ తెలిసిందే.

ఆచార్య సినిమా తర్వాత కొరటాల శివ ఏ హీరోతో సినిమా చేస్తాడు అని అనుకున్న తరుణంలో ఎన్టీఆర్ తో సినిమా ఉండబోతుంది అని అనౌన్స్మెంట్ వచ్చింది. అప్పటికే ఎన్టీఆర్ అలా చాలామంది డిజాస్టర్ డైరెక్టర్ తో పనిచేసి హిట్ సినిమాలు కొట్టాడు. ఒకప్పుడు సక్సెస్ఫుల్ డైరెక్టర్ వెనుక పరుగు పెట్టి ఫెయిల్యూర్స్ అందుకున్న ఎన్టీఆర్ తర్వాత కాలంలో ఫెయిల్యూర్ డైరెక్టర్ వెనుకబడి సక్సెస్ కొట్టాడు. ఇక ఆచార్య సినిమా గురించి ఇన్ డైరెక్ట్ గా స్పందించాడు ఎన్టీఆర్.

- Advertisement -

Acharya

ఆచార్య సినిమాపై రియాక్షన్

దేవర సినిమాకు సంబంధించిన ట్రైలర్ను రీసెంట్గా రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్లో ఎన్టీఆర్ మాట్లాడుతూ కొరటాల శివ కి ఒక రైట్ స్పేస్ కావాలి అలానే ఆయన చుట్టూ ఒక రైట్ పీపుల్ ఉండాలి అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో చాలామంది ఆచార్య సినిమాను ఉద్దేశించే ఎన్టీఆర్ మాట్లాడుతున్నారు అని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఆచార్య సినిమాకు సంబంధించి మెగాస్టార్ చిరంజీవి ఇన్వాల్వ్మెంట్ చాలా ఉందని పలు ఇంటర్వ్యూస్ లో కొరటాల శివ చెప్పుకొచ్చారు. వాస్తవానికి కొరటాల శివకు సరైన ఫ్రీడమ్ ఈ సినిమాకి ఇవ్వలేదని బయట సర్కిల్స్ లో వినిపించింది. అందువలన సినిమా ఫలితం అలా ఉంది అని చాలామంది ఊహగానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ తో ఆ మాటలు మరికాస్త బలపడ్డాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు