Jr Ntr : ఎన్టీఆర్ రేంజ్ పెరిగింది బ్రో.. ఇది కదా ఫ్యాన్స్ కోరుకొనేది..

Jr Ntr : జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ ఇప్పుడు పెరిగిందనే చెప్పాలి.. త్రిపుల్ ఆర్ సినిమా ఆస్కార్ ను అందుకోవడంతో ఎన్టీఆర్ కు ప్రపంచ వ్యాప్తంగా ఫాలోయింగ్ పెరిగింది. దాంతో యంగ్ టైగర్ కాస్త గ్లోబల్ స్టార్ అయ్యాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.. డిసెంబర్ లో దేవరను ప్రపంచం వ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.. తాజాగా ఎన్టీఆర్ సినిమాకు న్యూయర్క్ లో అరుదైన గౌరవం దక్కిందని తెలుస్తుంది..

ఎన్టీఆర్ దేవరలోని లుక్ ప్రస్తుతం న్యూయర్క్ టైమ్స్ స్క్వేర్ లో ప్రదర్శించినట్లు ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫోటోలలో ఎన్టీఆర్ సీరియస్ లుక్ లో, నల్ల చొక్కా పంచెలో, భుజాన కండువాతో కనిపిస్తున్నాడు.. ఈ ఫొటో నెట్టింట ట్రెండ్ అవ్వడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.. సినిమాకు అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది.. సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అంటూ ఫ్యాన్స్ సంబరాలు మొదలెట్టేశారు..

Devara on New York Time Square screen.. Photo viral
Devara on New York Time Square screen.. Photo viral

కొందరేమో ఎన్టీఆర్ సెట్ నుంచి ఫోటో లీకయిందని వాదన వినిపిస్తున్నారు. అయితే ఇప్పటివరకూ చూపించిన దేవర లుక్‌లో తక్కువ గడ్డం, ఉంగరాల జుట్టుతో అదరగొట్టారు ఎన్టీఆర్. ఇప్పుడు డిఫరెంట్‌గా ఉండటంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.. ఈ ఫోటోను తారక్ ఫ్యాన్స్ మరింత వైరల్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది…

- Advertisement -

ఈ మూవీలో ఎన్టీఆర్ తండ్రి, కొడుకుగా కనిపించబోతున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజమేంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యక తప్పదు… ఈ సినిమా సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు