Devara Release Date : అనుకున్నట్టే పవన్ తో పోటీకి సై అంటున్నాడు… కానీ ఓ ప్రాబ్లమ్…

Devara Release Date : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఒక పండగ వాతావరణం నెలకొంటుంది. పవన్ కళ్యాణ్ వరుసగా 7 బ్లాక్ బస్టర్ సినిమాలు తర్వాత, పదేళ్లపాటు ఒక హిట్ సినిమా కూడా లేకుండా పోయింది. అయితే సినిమాలు డిజాస్టర్ అవుతున్నకొద్దీ పవన్ కళ్యాణ్ కు క్రేజ్ పెరిగింది. అయితే గబ్బర్ సింగ్ సినిమా పవన్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి మంచి కం బ్యాక్ ఫిలిం అయింది. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ఓ.జి.

పదేళ్ల తరువాత అదే డేట్

ఓ.జి సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. ఇదే తారీఖున దాదాపు 10 ఏళ్ళు క్రితం అత్తారింటికి దారేది అనే సినిమా రిలీజ్ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే అదే డేట్ న ఓ.జి సినిమా వస్తుంది అని అనౌన్స్ చేసినప్పుడు చాలామంది హ్యాపీగా ఫీలయ్యారు. ప్రస్తుతం ఆ డేట్ కి ఓ.జి సినిమా రావట్లేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Devara Release Date

- Advertisement -

ఎన్టీఆర్ పై నెగిటివిటీ

ఇకపోతే సెప్టెంబర్ 27వ తారీఖున ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇకపోతే ఈ సినిమా టైంలో రావడం అనేది కొంచెం రిస్క్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కొంతమంది టీడీపీ శ్రేణులలో ఎన్టీఆర్ పైన తీవ్రమైన నెగెటివిటీ ఉంది దీనికి కారణం ఎలక్షన్స్కు ముందు టిడిపి పార్టీ కోసం కనీసం కూడా పనిచేయకుండా ఎన్టీఆర్ ప్రవర్తించిన తీరు చాలామందిని ఆగ్రహానికి గురిచేసింది. అయితే గెలిచిన తర్వాత ఎన్టీఆర్ పార్టీ అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలియజేశారు అంటూ చాలామంది ట్రోల్స్ కూడా చేశారు. కొద్దిపాటి టిడిపి అభిమానులు కూడా సినిమా పైన నెగిటివ్గా ప్రచారం చేయడం మొదలు పెడతారు అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ కి పోటీగా నిలబడగలడా.?

ఇకపోతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ రేంజ్ పీక్ లో ఉంది. పూజి సినిమా రిలీజ్ కాకముందే డిప్యూటీ సీఎం సినిమా రాబోతుంది అంటూ చాలామంది ఎలివేషన్స్ ఇస్తున్నారు. అలానే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంత కీలకంగా ఉన్నారు తెలియనిది కాదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన ఒక గేమ్ చేంజర్. ఈ టైంలో పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అని అంటే ఎక్స్పెక్టేషన్స్ హై రేంజ్ లో ఉంటాయి ఆ సినిమాకి నార్మల్ టాక్ వచ్చినా కూడా దాని ప్రభంజనం వేరే లెవెల్ లో ఉంటుంది. అయితే ఈ టైంలో ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ కి పోటీగా నిలబడగలడా అంటూ కొంతమంది సోషల్ మీడియా వేదిక చర్చలు జరుపుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు