Devara Romantic Song Shoot : షూటింగ్ అండమాన్ నికోబార్ దీవుల్లో

Devara Romantic Song Shoot : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో జరుగుతున్న మోస్ట్ క్రెజియస్ట్ ప్రాజెక్ట్స్ లో దేవర సినిమా ఒకటి. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుంది. ఇదివరకే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ మే 19న విడుదల కానుంది. ఈ మొదటి సింగిల్ సాంగ్ కోసం చాలామంది క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.

కొరటాల శివకు దేవర సినిమా కీలకం
ఇకపోతే దేవర సినిమా అనేది కొరటాల శివ కెరియర్ కి కీలకమని చెప్పొచ్చు. ఆచార్య సినిమా ముందు వరకు తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు కొరటాల. వరుస సూపర్ హిట్ సినిమాలు తర్వాత ఏకంగా మెగాస్టార్ తో సినిమాను చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అయితే మెగాస్టార్ తో చేసిన ఆచార్య సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఈ ఓటమితో కొన్ని రోజులు పాటు బయట కనిపించలేదు కొరటాల. మళ్లీ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వాలని ఉద్దేశంతో ఈ సినిమాను అద్భుతంగా డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఫస్ట్ సింగిల్ రెడీ అవుతుంది
ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమాకి సంబంధించిన టీజర్ చాలామంది ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఎన్టీఆర్ లోని మాస్ యాంగిల్ ను మరోసారి బయటకు తీసింది. అయితే రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ అనౌన్స్ చేయగానే, ఎన్టీఆర్ అభిమాని ప్రముఖ నిర్మాత నాగ వంశీ అనిరుద్ జైలర్ కి కంపోజ్ చేసిన హుకున్ సాంగ్ ని మరిచిపోయేటట్టు ఈ సాంగ్ ఉంటుందని చెప్పాడు. ఇకపోతే ఈ సినిమా గురించి మరో క్రేజీ అప్డేట్ తెలుస్తుంది. ఈ సినిమాలోని ఒక రొమాంటిక్ సాంగ్ ను ఏడు రోజులు పాటు షూటింగ్ చేయబోతున్నట్టు సమాచారం వినిపిస్తుంది. మే 24 వ తారీకు నుంచి ఈ సాంగ్ షూటింగ్ చేయబోతున్నట్లు విశ్వసినీ వర్గాల సమాచారం.

- Advertisement -
Devara Romantic Song Shoot : Shooting in Andaman and Nicobar Islands
Devara Romantic Song Shoot : Shooting in Andaman and Nicobar Islands

రొమాంటిక్ సాంగ్ అక్కడ జరగనుంది
అయితే ఈ రొమాంటిక్ సాంగ్ ను అండమాన్ నికోబార్ దీవుల్లో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పాటకు ఏకంగా ఇద్దరు కొరియోగ్రాఫర్లు పని చేయనున్నారని కథనాలు వినిపిస్తున్నాయి. ఇక అనిరుద్ కంపోజ్ చేసే సాంగ్స్ కోసం ఆడియన్స్ ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాను అక్టోబర్ నెలలో రిలీజ్ చేయబోతున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు