Devara: బాలీవుడ్ పాపతో తారక్ మాస్ బీట్… ఈ పాపకు అంత సీన్ ఉందా..?

Devara: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ లో ఎన్టీఆర్ ఒకరు. బాల నటుడుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత నిన్ను చూడాలని సినిమాతో హీరోగా మారాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అక్కడితో ఎన్టీఆర్ హీరోగా నిలబడిపోయాడు.

అయితే ఎన్టీఆర్ కి మంచి స్టార్ ఇమేజ్ ని తీసుకొచ్చిన సినిమా మాత్రం ఆది. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ సినిమా తర్వాత మాస్ కమర్షియల్ సినిమాల్ చేయడం మొదలుపెట్టాడు ఎన్టీఆర్. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి సినిమా మంచి హిట్ అయింది. అక్కడితో తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ అయింది. ఇకపోతే ఎన్టీఆర్ ఒక టైంలో వరుసగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ తో సినిమాలు చేసి ఫెయిల్యూర్ చూశాడు. ఆ తర్వాత ఫెయిల్యూర్ డైరెక్టర్ తో పని చేయడం మొదలుపెట్టి సక్సెస్ చూశాడు.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ సినిమా తర్వాత వరుసగా ఎన్టీఆర్ కెరియర్ లో అన్ని హిట్ సినిమాలు వచ్చాయి. అయితే తారక్ ఒకదాన్ని మించిన హిట్ సినిమా ఒకటి కొట్టాడు. ప్రస్తుతం తారక్ చేస్తున్న సినిమా దేవర. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. లేకపోతే ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జంటగా జాన్వి కపూర్ నటిస్తోంది.

- Advertisement -

Jr NTR, Janhvi Kapoor

అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక సెట్ ను హైదరాబాద్ లోని శంషాబాద్ లో వేసినట్లు తెలుస్తుంది. అయితే ఒక మాస్ సాంగ్ ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటుందట. ఈ సాంగ్ ను శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ లో ఉన్న గ్రేస్ ఏంటో ఇదివరకే చాలా సినిమాల్లో చూసాం. ఇకపోతే జాన్వి కపూర్ ఎన్టీఆర్ గ్రేస్ ని అందుకుంటుందా లేదా అనేది సినిమా రిలీజ్ అయితే గాని చెప్పలేం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు