Devara : విశ్వక్, సిద్ధూతో దేవర టీం చిట్ చాట్.. అభిమానాన్ని గట్టిగానే వాడుకుంటున్నారుగా!

Devara : జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ (Koratala siva) కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “దేవర” సెప్టెంబర్ 27న విడుదలకు రెడీ అవుతుంది. పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలున్న ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇక దేవర ట్రైలర్ ని కూడా రెండు రోజుల కింద యూట్యూబ్ లో విడుదల చేయగా, మిక్సడ్ రెస్పాన్స్ ని అందుకుంటుంది. ఇక దేవర (Devara Trailer) ట్రైలర్ యూట్యూబ్ లో పెద్దగా రికార్డ్స్ అందుకోలేకపోయినా సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసింది. అయితే సినిమాపై అంచనాలను మరింత పెంచడానికి చిత్ర యూనిట్ ప్రమోషన్లను వేగవంతం చేసింది. దీనికోసం ఎన్టీఆర్ ఏకంగా ఇద్దరు హీరోలను రంగంలోకి దింపాడు.

Devara team chit chat with Vishwak Sen, Siddhu Jonnalagadda

విశ్వక్, సిద్ధూతో దేవర టీం చిట్ చాట్..

ఇక దేవర సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇప్పటికే ట్రైలర్ ని రిలీజ్ చేయగా, ఆ సినిమా అంచనాలను బాగా పెంచేసింది. అంతకు ముందు రిలీజ్ అయిన పాటలు కూడా డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. కాగా దేవర చిత్ర యూనిట్ వరుస ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంటుంది. ఈ క్రమంలో దేవర కోసం ఇద్దరు హీరోలు రంగంలోకి దిగారు. తాజాగా టాలీవుడ్ హీరోలైన విశ్వక్ సేన్ (Vishwak sen), సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) తో దేవర టీం చిట్ చాట్ నిర్వహించింది. ఈ చిట్ చాట్ లో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తో పాటు డైరెక్టర్ కొరటాల శివ కూడా ఉన్నారు. ఈ వీడియో ని రేపు యూట్యూబ్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంది.

- Advertisement -

అభిమానాన్ని వాడుకుంటున్న దేవర..

అయితే విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ పక్కా నందమూరి అభిమానులని సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరూ నటించిన పలు సినిమాలని ఎన్టీఆర్, బాలకృష్ణ (Balakrishna) పలుమార్లు ప్రమోట్ కూడా చేసారు. ఇక ఎన్టీఆర్ కూడా ఇప్పుడు తన అభిమానులైన ఈ హీరోలని దేవర ప్రమోషన్లకు గట్టిగానే వాడుతున్నారని నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఓ దశకొచ్చేసరికి దేవరకి (Devara) ఓవర్ ప్రమోషన్లు ఏమైనా చేస్తున్నారా? అన్న టాక్ కూడా నడుస్తుంది. ఎందుకంటే కంటెంట్ లేకపోతే ఈరోజుల్లో ఓపెనింగ్స్ తోనే అంతా కొట్టేయాలని మేకర్స్ ప్రమోషన్లు భారీగా చేస్తున్నారు. పైగా దేవర కాన్సెప్ట్ మొత్తం ఆల్మోస్ట్ ట్రైలర్ లోనే చెప్పేశాడు కొరటాల. మరి దేవర సినిమాతో కొరటాల శివ ఏ స్థాయిలో ప్రేక్షకులని మెప్పిస్తాడో చూడాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు